నాగార్జునపై నెగిటివ్ గా మిస్ ఇండియా ట్వీట్
మిస్ ఇండియా వాసుకి రీసెంట్ గా నాగార్జున తాజా చిత్రం రాజన్నని చూసింది. ఈ సినిమాపై కొన్ని కామెంట్స్ ని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసి సంచలనం రేపింది. తాను రాజన్న చిత్రం చూసానని,అయితే క్రిటిక్స్ ఎలా ఈ చిత్రానికి నాలుగు స్టార్స్ రేటింగ్ ఇచ్చారో అర్దం కావటం లేదని అంది. ఇక ఇలాంటి రేటింగ్ ని తాను డాన్ 2 కు కూడా చూడలేదందంటూ కాస్త ఘాటుగానే ట్వీట్ చేసింది. అయితే ఇది నాగార్జున ఫ్యాన్స్ కి చాలా కోపం తెప్పించింది. వారు రిప్లైగా ఆమెకు కొన్ని కామెంట్స్ చేసారు.
అయితే ఇవన్నీ చూసిన ఆమె ..ఎందుకిలా రిడిక్యులస్ గా మాట్లాడుతున్నారో అర్దం కావటం లేదు...ఇది నా ఒపీనియన్ మాత్రమే. ట్విట్టర్ లాంటి మైక్రో బ్లాగింగ్ సైట్ల ద్వారా నా అభిప్రాయం ఎవరితో అయినా పంచుకునే స్వేచ్చ ఉందని ఎందుకు అర్దం చేసుకోరు..ఇది నా మైక్లో బ్లాగ్..ఇక్కడ నేను అభిప్రాయాలను పోస్ట్ చేసుకుంటాను అని స్పష్టంగా చెప్పింది. ఇక నాగార్జున హీరోగా విజియేంద్రప్రసాద్ డైరక్ట్ చేసిన చిత్రం రాజన్న. రాజమౌళి..యాక్షన్ సీక్వెన్స్ లు డైరక్ట్ చేసిన ఈ చిత్రం తెలంగాణా సాయిధ పోరాట యోధుని కధను చెప్తుంది. కీరవాణి పాటలు హైలెట్ గా రూపొందిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా సినిమా మాత్రం ఆర్దికంగా కలిసిరాలేదు.


Click it and Unblock the Notifications











