పార్వతికి నాగ్,మహేష్‌ ఇష్టం!

By Staff

Parvathy Omanakuttan
తెలుగులో నాగార్జున, మహేష్‌ అంటే తనకు ఇష్టమని మిస్‌ వరల్డ్‌ 2008 రన్నరప్‌ అయిన పార్వతీ ఒమన్‌కుట్టన్‌ తెలిపారు. సినీ పరిశ్రమలోకి రావాలని భావిస్తున్నా. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఈ మలయాళ సుందరి హైటెక్స్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె ఇటు దక్షిణాది భాషాచిత్రాల్లో, అటు బాలీవుడ్‌లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా... హిందీ, మలయాళ సినిమాలు ఎక్కువ చూస్తుంటా. తెలుగు, తమిళ సినిమాల గురించి కొంత తెలుసంటూ చెప్పుకొచ్చింది.

అలాగే తెలుగులో నాగార్జున, మహేష్‌ అంటే ఇష్టం. తమిళంలో రజనీకాంత్‌, మలయాళంలో మమ్ముట్టి, పృథ్వీరాజ్‌, బాలీవుడ్‌లో అమితాబ్‌, అభిషేక్‌, హృతిక్‌, సల్మాన్‌, షారుక్‌ అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చిందామె. ఒకరకమైన సినిమాలని కాక, అన్ని రకాల ఎమోషన్లు వున్న సినిమాలంటే ఇష్టపడతా. దక్షిణాది సంప్రదాయ కుటుంబాల్లో సినిమా, ఫ్యాషన్‌ ఇండస్ట్రీలంటే తప్పుడు భావన వుండటం వల్లే ఎక్కువమంది అమ్మాయిలు ఈ రంగాల్లోకి రావడం లేదనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. నాకు మ్యూజిక్‌ అన్నా, డాన్స్‌ అన్నా ఇష్టం. ఐ లవ్‌ హైదరాబాద్‌. ఇదివరకు వచ్చినప్పుడు చార్మినార్‌ చూశా.

ఇక మిస్‌ వరల్డ్‌ పోటీలో పాల్గొనడం గొప్ప అనుభూతినీ, అనుభవాన్నీ ఇచ్చిందన్నారు. అలాగే మిస్‌ ఇండియా వరల్డ్‌గా ఎన్నికయ్యాక మిస్‌ వరల్డ్‌ పోటీదారులతో గడిపిన వారం రోజులు చాలా విషయాలు తెలుసుకున్నా.అది గొప్ప జర్నీ. పోటీలో విజేతను కాకపోయినా రన్నరప్‌గా గెలవడం నా కలను దాదాపు నిజం చేసుకున్నట్లుగానే భావిస్తున్నా. జనం దృష్టిలో నేనే విన్నర్‌ని. అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X