నీలకంఠ మిస్సమ్మ తమిళంలో
ఈ మధ్య కాలంలో చంద్రముఖి అపరిచితుడు గజిని తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీగా డబ్బు వసూలు చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుల సృజనాత్మకతను మన సినిమా వాళ్ళు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మరిన్ని తమిళ సినిమాలు తెలుగులోకి రానున్నాయి. ఎట్టకేలకు ఒక తెలుగు సినిమా తమిళంలో రీమేక్ కానుంది. రెండేళ్ళ క్రితం మిస్సమ్మ అనే వెరైటీ సినిమా తీసి విజయం సాధించిన ఆఫ్ బీట్ దర్శకుడు నీలకంఠ ఇప్పుడు ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు. ఆయన పెద్ద తమిళ హీరోనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నీలకంఠ ప్రస్తుతం తీస్తున్న నందనవనం 120 కిలోమీటర్లు సినిమా మే నెలలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











