twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భూమిక 'మిస్సమ్మ' చిత్రం నిర్మాత మృతి

    By Srikanya
    |

    హైదరాబాద్ : భూమికతో 'మిస్సమ్మ', 'మాయాబజార్‌' చిత్రాలు నిర్మించిన సినీ నిర్మాత బొల్లు సత్యనారాయణ (61) శనివారం మధ్యాహ్నం తిరుపతిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

    ఆయన నిర్మించిన ‘మిస్సమ్మ' (2003) చిత్రంలో భూమిక టైటిల్‌ రోల్‌ పోషించారు. నీలకంఠ దర్శకత్వం వహించిన ‘మిస్సమ్మ' ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడంతో పాటు రివార్డులూ పొందింది. అలాగే ‘మాయాబజార్‌' చిత్రంలో ప్రముఖ గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్ర పోషించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Missamma Producer B Satyanarayana No More

    ఆయన భార్య అన్నపూర్ణమ్మ తితిదే పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆయనకు కుమార్తె హరిత కుమారుడు తేజస్వి ఉన్నారు. సత్యనారాయణ స్వస్థలం నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం జువ్విగూడెం.

    సత్యనారాయణ సినీ ప్రస్థానం 1981లో 'ముద్దమందారం'తో ప్రారంభమైంది. ఆ సినిమాకు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2002లో 'ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ'తో నిర్మాతగా మారారు. ఆపై 'బాలీవుడ్‌ కాలింగ్‌', 'మిస్సమ్మ', 'మాయాబజార్‌' తీశారు.

    Missamma Producer B Satyanarayana No More

    అనువాద చిత్రాలు 'అభిమన్యుడు', 'గీతాంజలి' ఆయనే నిర్మాత. 'మిస్సమ్మ'కుగాను 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నిర్మాతగా నంది పురస్కారం అందుకున్నారు. సత్యనారాయణ అంత్యక్రియలు ఆదివారం తిరుపతిలోని బాలాజీ కాలనీ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.

    English summary
    Senior producer B Satyanarayana is no more. He had been suffering from cancer for a while and finally succumbed to it. Satyanarayana founded Satyam Entertainments and produced several films including Bollywood Calling, Dhanalakshmi I Love You, Missamma, Mayabajar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X