'కజరారే' మిస్సై పోయాను అంటూ తెగ ఫీలైపోతున్న రామ్ చరణ్
రామ్ చరణ్ కి తన తండ్రి సినీ పరిశ్రమనుంచి రిటైర్మెంట్ తీసుకోవటం సుతరామూ ఇష్టం లేనట్లుంది. ఈ విషయమై ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ...నా కెప్పటినుంచో కజరారే తరహా సాంగ్ మా నాన్న తో కలిసి చేయాలని కల. అభిషేక్ బచ్చన్ తం తండ్రితో కలసి అనేక సినిమాల్లో నటించారు. భలే లక్కీ.నాకా అదృష్టం లేనట్టేనా అంటూ వాపోయారు. ఇక కజరారే సాంగ్..అభిషేక్ బచ్చన్, అమితాబ్, ఐశ్వర్య రాయ్ ల మధ్య వస్తుంది.బంటి అవుర్ బబ్లి చిత్రంలో ఉన్న ఈ పాట అప్పట్లో మంచి హిట్ అయ్యింది. ఇలాంటి పాట చెయ్యాలని ప్రతీ సిని వారసులకు ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.


Click it and Unblock the Notifications











