twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు ‘దాగుడు మూతలు’.. బాధగా ఉంది.. హరీష్ శంకర్ ఆవేదన

    By Bojja Kumar
    |

    'డిజె-దువ్వాడ జగన్నాధమ్' తర్వాత హరీష్ శంకర్ తర్వాతి సినిమా ఏమిటి? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. తర్వాతి సినిమా కూడా ఇదే బేనర్లో చేసే అవకాశం రావడంతో కొంత కాలంగా స్క్రిప్టు పనిలో మునిగిపోయాడు హరీష్. అయితే ఇప్పటి వరకు స్క్రిప్టును ఫైనల్ కాక పోవడంతో 2018లో హరీష్ శంకర్ సినిమా రావడం లేదని తేలిపోయింది.

    తన మూవీ లేక పోవడంపై హరీష్ ఆవేదన

    తన మూవీ లేక పోవడంపై హరీష్ ఆవేదన

    తాజాగా దిల్ రాజుకు చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రస్తుతం తాము నిర్మిస్తున్న 5 సినిమాల విడుదల తేదీలను ఖరారు చేస్తూ ఓ లిస్టు విడుదల చేసింది. ఇందులో తన మూవీ లేక పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ హరీష్ ట్వీట్ చేశారు.

    ఆ ఐదు సినిమాలు ఇవే...

    ఆ ఐదు సినిమాలు ఇవే...

    దిల్‌ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో రాబోతున్న 5 మూవీల విడుదల తేదీలు

    • లవర్‌- జూలై 20, 2018
    • శ్రీనివాస కళ్యాణం- ఆగస్టు 9, 2018
    • హలోగురు ప్రేమకోసమే- అక్టోబర్‌ 18, 2018
    • ఎఫ్‌2- జనవరి 12, 2019
    • ఎస్‌ఎస్‌ఎంబీ25- ఏప్రిల్‌ 5, 2019
    • ఫీలింగ్ వైర్డ్ అంటూ..

      ‘ఆ ఐదు సినిమాల జాబితాలో నా మూవీ లేదు. ఇదొక భయానక అనుభూతి. కానీ కొన్నిసార్లు కొన్ని తప్పవు. ఆ 5 సినిమాలు మంచి విజయం సాధించాలని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

      హరీష్ శంకర్ ‘దాడుగు మూతలు'?

      హరీష్ శంకర్ ‘దాడుగు మూతలు'?

      హరీష్ శంకర్ కొన్ని రోజులుగా ‘దాగుడు మూతలు' అనే స్క్రిప్టుపై పని చేస్తున్నారు. అయితే స్క్రిప్టు విషయంలో నిర్మాత దిల్ రాజు-హరీష్ శంకర్ మధ్య ఏకాభిప్రాయం రాక పోవడంతో ఇది ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. ఇటీవల ప్రెస్ మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ.... ‘దాగుడు మూతలు' స్క్రిప్టు వర్కౌట్ కాకుంటే, మరో స్క్రిప్టుతో హరీష్ శంకర్ సినిమా చేస్తామని తెలిపారు.

    English summary
    DilRaju's SVC official upcoming Films Confirmed Release Dates. Lover - July 20, 2018, SrinivasaKalyanam - Aug 9, 2018, HelloGuruPremaKosame Oct 18, 2018, F2 - Jan 12, 2019, SSMB25 - April 5, 2019. "Missed my film in this list .... Feeling weird ..... but konni saarlu konni thappavu ..My whole hearted Best wishes to all the 5 films." Harish Shankar Tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X