అఖిల్ చిత్రం టైటిల్ విషయమై నితిన్ ఇలా...

By Srikanya

హైదరాబాద్ : అఖిల్ హీరోగా నితిన్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రానికి టైటిల్ విషయమై రకరకాల రూమర్స్ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి మిస్సైల్ అనే టైటిల్ పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ విషయమై క్లారిఫికేషన్ ఇవ్వాలని నితిన్ నిర్ణయించుకుని ట్వీట్ చేసారు.

నితిన్ ట్వీట్ చేస్తూ..., "మేము ఇప్పటివరకూ...ప్రొడక్షన్ ఎ కు ఏ టైటిల్ ఫైనలైజ్ చేయలేదు. మిస్సైల్ అనే టైటిల్ అయితే అసలు కన్సిరిడేషన్ లోనే లేదు. మేము టైటిల్ ఫైనల్ చేసాక మీకు తెలియచేస్తాము..." అన్నారు. ఆ ట్వీట్ ని మీరే స్వయంగా క్రింద వీక్షించండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Read More:లీకైంది: అఖిల్ అక్కినేని డాన్సింగ్ వీడియో హల్ చల్

అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ హీరోయిన్. ఈ చిత్రానికి కి సంబంధించిన విశేషాల్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నాడు. రీసెంట్ గా...స్పెయిన్‌లో నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నాం. నాపై చిత్రీకరిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

త్వరలో యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన చిత్రాల్ని పోస్ట్ చేస్తాను. అంతవరకు వేచి చూడండి అంటూ ట్విట్టర్‌లో స్పందించారు అఖిల్. స్పెయిన్ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్‌లో ఓ పాటని చిత్రీకరిస్తారని, జూన్ నెలలో యుగాండాలో మరో షెడ్యూల్ జరపనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.

వి.వి.వినాయక్ తనదైన శైలిలో పవర్‌ఫుల్ మాస్ అంశాల మేళవింపుతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, అక్కినేని అభిమానులు, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో వుంటాయని నిర్మాత నితిన్ తెలిపారు.

“Missile” is not Akhil’s Title

అందులోనూ ఇంత మంచి టీమ్ తో కలసి పని చేస్తుండటంపై అఖిల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు అక్కినేని చిన్నోడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అఖిల్ కు తండ్రిగా నటిస్తుండగా... సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి దుర్గా నవరాత్రులకు ముస్తాబవుతున్న తన తొలి చిత్రంతో అఖిల్ ఈ ఏడాది దసరా బుల్లోడు అవుతాడేమో చూడాలి అంటున్నారు అభిమానులు.

నిర్మాత నితిన్ మాట్లాడుతూ...ఈ సినిమా ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసే అన్ని అంశాలతో వినాయక్ ఈ సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఒక సాంగ్‌ని సెట్‌లో చిత్రీకరించబోతున్నాం. జూన్‌లో 35 రోజులపాటు యుగాండాలో భారీ షెడ్యూల్‌ వుంటుంది. వెలిగొండ శ్రీనివాస్‌, కోన వెంకట్‌, అనూప్‌ రూబెన్స్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌, అమోల్‌ రాథోడ్‌, ఎ.ఎస్‌.ప్రకాష్‌, రవివర్మ వంటి టాప్‌ టాప్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చెయ్యాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు'' అన్నారు.

అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X