ప్రియుడితో గడిపేందుకే... డ్రామా బయిటపడింది

By Srikanya

ముంబయి: ఆ మధ్యన తెలుగు హీరోయిన్ అంజలి ..మాయం...తర్వాత డ్రమటిక్ గా విషయం బయిటపడినట్లుగానే ఇప్పుడు మరో నటి వ్యవహారం కూడా బయిటకు వచ్చింది. పదిరోజులుగా అదృశ్యమైన మరాఠీ నటీ అల్కా పుణేవార్‌ చెన్నై పోలీసుల అదుపులో క్షేమంగానే ఉన్నట్లు తెల్సింది. డిసెంబర్‌ 27న ఉరణ్‌ షూటింగ్‌ సమయంలో గొడవ జరిగిందని, దీంతో అక్కడ్నుంచి పుణే వెళ్లినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి అల్కా భర్త సంజయ్‌కు సమాచారం అందింది. అయితే అల్కా పుణేకు చేరుకోకపోగా సెల్‌ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరసటిరోజు డిసెంబర్‌ 28న ముంబయి-పుణే రహదారిలోని ఖోపోలి సమీపంలో ఓ లోయలో నుజ్జునుజ్త్జెన అల్కా కారును పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి గడిపేందుకు వ్యూహ రచన చేసి కారును లోయలో నెట్టేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అల్కాను, ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలియవచ్చింది.

'Missing' actress Alka Punewar in Chennai with her boyfriend

వివరాల్లోకి వెళితే... మరాఠీ నటి అల్కా పునేవర్‌ గత తొమ్మిది రోజులుగా కనిపించడం లేదు. అల్కా వయసు 49. డిసెంబర్‌ 27వ తేదీన ఇంటి నుండి వెళ్లిన అల్కా పునేవర్‌ తిరిగి రాలేదని ఆమె భర్త సంజయ్‌ పునేవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబెై - పుణే రోడ్డులోని ఖోపోలి సమీపంలో ఆమె కారును పోలీసులు గుర్తించారు. ఖొబపోలి సమీపంలో ఏడువందల అడుగుల లోతెైన లోయలో ధ్వంసమై పడి ఉన్న అల్కా కారును డిసెంబర్‌ 30వ తేదీన పోలీసులు గుర్తించారు. కారులో ఆమె సెల్‌ఫోన్‌, బ్యాగు ఉన్నాయి. అయితే, అల్కా ఆచూకీ లభించలేదు.

అల్కా భర్త సంజయ్‌ ఫిర్యాదు మేరకు కోప్రి పోలీసులు ఐదు రోజుల క్రితం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గురించి గాలిస్తున్నారు. అల్కాను తాను థానే రెైల్వే స్టేషన్లో తన కారులో దింపానని, అక్కడే ఆమెను వారి డ్రెైవర్‌ పికప్‌ చేసుకున్నాడని, అరగంట తర్వాత తన భార్య తనకు ఫోన్‌ చేసి డ్రెైవర్‌ పికప్‌ చేసుకున్నాడని, తాము వెళ్తున్నామని చెప్పిందని భరత్‌ సంజయ్‌ చెప్పాడు. అయితే, డిసెంబర్‌ 28న మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్‌ వచ్చిందని, అల్కా ఇంటికి చేరిందా అని ప్రశ్నించారని, అయితే తాను అల్కాకు ఫోన్‌ చేస్తే ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని సంజయ్‌ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X