Mission Raniganj: గవర్నమెంటు కంటే ముందే జాగ్రత్తపడ్డ అక్షయ్ కుమార్.. దెబ్బకి టైటిల్ మార్చాడుగా?
ఇండియాను.. భారత్ గా మార్చనున్నట్లు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దేశం పేరు మారకముందే బాలీవుడ్ లో స్టార్ హీరో ముందే జాగ్రత్త పడ్డాడు. తన సినిమా పేరును మార్చుకుని నెట్టింట వైరల్ గా మారాడు. ఆ సినిమా ఏంటి.. దాని వివరాలు ఈ స్టోరీలో తెసుకుందాం.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చాలా రోజుల తర్వాత ఓ మై గాడ్ చిత్రంతో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మిషన్ రాణీ గంజ్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. దీనికి మొదట్లో ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ అనే ట్యాగ్ లైన్ ఉండేది. కానీ దానిని తాజాగా గ్రేట్ భారత్ రెస్క్యూగా మార్చింది మూవీ టీం. ఇండియా పేరును భారత్ గా మార్చడం వల్లే ఈ సినిమా పేరు మారిందని అంటున్నారు.

అక్షయ్ కుమార్ మిషన్ రాణీగంజ్ మూవీ 1989లో ఓ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడంలో కీలకపాత్ర పోషించిన జశ్వంత్ సింగ్ గిల్ వీరత్వంపై చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో లీడ్ క్యారెక్టర్ ను అక్షయ్ కుమార్ చేస్తున్నాడు. ఈ పేరు మార్పుకు దేశం పేరు మార్పుకు ఏదైనా లింక్ ఉందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
గత వారం భారత రాష్ట్రపతిని జీ20 సదస్సు ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే సంభోదించడంతో దేశం పేరు మార్చబోతున్నారన్న చర్చ మొదలైంది. దీనిపై రాజకీయ రచ్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిషన్ రాణీగంజ్ మూవీ ట్యాగ్ లైన్ మారడం ప్రముఖంగా చర్చనీయంశం అవుతుంది.

తాజాగా మిషన్ రాణిగంజ్ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ గమనిస్తే.. మైనింగ్‌లో చిక్కుకున్నట్లు ఉన్న కార్మికులను కాపాడే వ్యక్తిగా అక్షయ్ కుమార్ లుక్ కనిపిస్తుంది. కాగా ఈ సినిమా టీజర్ ను అక్షయ్ కుమార్ బర్త్ డే పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 09 విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

రాణీ గంజ్ సినిమా విషయానికి వస్తే... 1989లో రాణీగంజ్ బొగ్గు గనిలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా ఈ మిషన్ రాణీగంజ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహిస్తుండగా.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వశ్ భగ్నానీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తోపాటు పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, రవి కిషన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











