twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమాలో అదే తప్పు ..బాలీవుడ్ నుంచి పిలిచి కైరా అద్వానీని అలా చేయొచ్చా!

    |

    Recommended Video

    మహేష్ తప్పు, కైరా అద్వానీని అలా చేయొచ్చా!

    మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను. మహేష్ తొలిసారి ఈ చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడో అనే ఆసక్తి రోజురోజుకు అభిమానుల్లో ఎక్కువైపోతోంది. శ్రీమంతుడు వంటి ఘన విజయం తరువాత మహేష్ -కొరటాల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. తెలుగు చిత్రాల్లో ఎక్కువ భాగం హీరోయిన్లకు సరైన పాత్రలు ఉండడం లేదని కేవలం వారిని గ్లామర్ పరంగా మాత్రమే సినిమాల్లో చూపిస్తున్నారనే కామెంట్లు ఎక్కువవుతున్నాయి. మహేష్ భరత్ అనే నేను చిత్రం విషయంలో కూడా ఇలాంటి వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

    రీసౌండ్ తో అదరగొట్టాడు

    రీసౌండ్ తో అదరగొట్టాడు

    భరత్ అనే నేను అంటూ మహేష్ బాబు వినిపించిన ప్రమాణస్వీకారం ఆసక్తిని రేకెత్తించింది. ప్రమాణస్వీకారంలోని మహేష్ బాబు వాయిస్ లోని బేస్ రీసౌండ్లు పుట్టించిందని చెప్పొచ్చు.

    ఉమ్మడి ఏపీ పాలిటిక్స్

    ఉమ్మడి ఏపీ పాలిటిక్స్

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఎమోషనల్ కథలని బలంగా ఆవిష్కరించే కొరటాల శివ ఈ చిత్రంలో మహేష్ బాబుని ఎలా చూపించబోతున్నాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    బాలీవుడ్ బ్యూటీని దించారు

    బాలీవుడ్ బ్యూటీని దించారు

    మహేష్ కు జోడిగా ఈ చిత్రంలో ఏకంగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని రంగంలోకి దించారు. కైరా ఈ చిత్రంలో మహేష్ తో రొమాన్స్ చేయనుంది.

    కోట్లిచ్చి అందుకు మాత్రమే

    కోట్లిచ్చి అందుకు మాత్రమే

    కోట్లు వెచ్చించి ఈ చిత్రానికి కైరా అద్వానీని ఒప్పించారు. కానీ ఆమెని కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారట. కైరా అద్వానీ పాత్రకు ఈ చిత్రంలో పెద్దగా ప్రాధాన్యత లేదని సమాచారం. పాటల్లో అందాలు ఆరబోయడానికి, పాటలకు ముందు ఒకటి అరా సన్నివేశాలలో కనిపించడానికి మాత్రం కైరాని తీసుకున్నట్లు తెలుస్తోంది.

    తెలుగు చిత్రాల్లో ఆ తప్పిదం

    తెలుగు చిత్రాల్లో ఆ తప్పిదం

    తెలుగు చిత్రాల్లో ఇటువంటి తప్పిదం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్లకు ప్రాధానత్య లేని చిత్రాలు వస్తూనే ఉన్నాయి.

    తేజు మూవీలో స్పష్టంగా

    తేజు మూవీలో స్పష్టంగా

    సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెట్ చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర గ్లామర్ కు మాత్రమే పరిమితం అయింది. లావణ్య త్రిపాఠి పాటలకు ముందు సన్నివేశాలలో మెరవడం, పాటలో అందాలు ఆరబోయడం.. సినిమా మొత్తం ఇదే తంతు జరిగింది.

    మళ్లీ రిపీట్ చేస్తున్న కొరటాల

    మళ్లీ రిపీట్ చేస్తున్న కొరటాల

    దర్శకుడు కొరటాల కూడా తన చివరి చిత్రం జనతా గ్యారేజ్ లో ఇలాంటి మిస్టేక్ చేశాడు. ఆ చిత్రంలో సమంత, నిత్యామీనన్ పాత్రలు అర్థం లేనివిగా ఉంటాయని క్రిటిక్స్ వెల్లడించారు. సినిమాలోని ఎమోషన్ కనెక్ట్ కావడం ఆ చిత్రం హిట్ అయింది.

     హీరోయిజంపైనే దృష్టి పెట్టాడా

    హీరోయిజంపైనే దృష్టి పెట్టాడా

    కొరటాల శివ చిత్రాల్లో కథని , హీరోయిన్ మరియు ఇతర పాత్రలని డామినేట్ చేసే విధంగా హీరోయిజం ఉంటుంది. కొరటాల సక్సెస్ ఫార్ములా అదే. కానీ హీరోయిన్ పాత్రని ప్రతి చిత్రంలో నామమాత్రం చేస్తూ వస్తే ఎక్కడో ఓ చోట బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం భరత్ అనే నేను ఎలా ఉండబోతోందో!

    English summary
    Mistake which is happened in Intteligent movie repeats in Mahesh movie. No proper role for Kiara Advani
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X