వర్మ వల్లే తప్పుచేశానంటున్న అమలపాల్
తన సెక్సీ లుక్స్‌తో యూత్ గుండెల్లో గునపాలు దించుతున్న అమలపాల్ నాగ చైతన్య 'బెజవాడ'చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా పరమ ప్లాపు కావడంతో అమల పాల్ తెలుగు ఎంట్రీ చాలా బ్యాడ్ గా స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'లవ్ ఫెయిల్యూర్' చిత్రం మాత్రం ఆమెకు మంచి ఫలితాలనే ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమల పాట్లాడుతూ....'బెజవాడ సినిమాలో నటించడానికి ఒప్పుకుని పెద్ద తప్పు చేశానని, అయితే ఆ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం రామ్ గోపాల్ వర్మనే, ఆయన సినిమా అనే ఒకే ఒక కారణం వల్లనే సైన్ చేశాను, ఆ సినిమా చేసి ఉండక పోయి ఉంటే తనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చేవి' అని అంటోంది.
అవ్ ఫెయిల్యూర్ చిత్రంలో అమలపాల్ నటనకు, అంద చందాలకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో ఆమె బబ్లీ యాక్టింగ్ చాలా మంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ భామ ఓ తమిళ చిత్రం, ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. బెజవాడ సినిమా చేయకముందే చాలా మంది తెలుగు దర్శకులు తనపై ఇంట్రస్టు చూపారని, బెజవాడ సినిమా చేయడం, అది ప్లాపు కావడంతో దర్శక నిర్మాతలకు తనపై ఆసక్తి తగ్గిందని వాపోతోందట.


Click it and Unblock the Notifications











