వివాదం-వివరణ :ఆ అమ్మాయి ఎవరో తెలియదంటూ అల్లు శిరీష్

అయితే సినీ నటుడిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. యువతి మాత్రం తనను వేధించిన వారిలో ఓ సినీ నటుడు కూడా ఉన్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇక తనపై ఓ యువతి కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలపై హీరో అల్లు శిరీష్ స్పందించారు. తాను ఎవరితో గొడవ పడలేదని ఆయన స్పంష్టం చేసారు. కేసు పెట్టిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆయన టీవీ ఛానెల్స్ తో చెప్పారు.
తనపై ఆమె ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారన్నారు. ప్రముఖ హీరో తమ్ముడని మాత్రమే ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. తన పేరు అనవసరంగా లాగుతున్నారని వాపోయారు. తాను క్లబ్ కు వెళ్లి రాత్రి 12.30 కే వచ్చేసాని, గొడవ 2 గంటలు ప్రాంతంలో జరిగిందని తనకు తెలిసిందన్నారు. తనకు సంభందం లేని దానిపై వివరణ ఎందుకు ఇవ్వాలని శిరీష్ ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











