»   » డార్క్ స్టోరీ: ఆర్తి అగర్వాల్ లైఫ్ లో చేసిన పొరపాట్లు

డార్క్ స్టోరీ: ఆర్తి అగర్వాల్ లైఫ్ లో చేసిన పొరపాట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ''జీవితం రోలర్‌ కోస్టర్‌ ప్రయాణం లాంటిది. నేనెప్పుడూ పరాజితురాలిని కాదు. నేను ఆడపులిని. యాక్సిడెంట్‌, ప్రేమలో విఫలం, పెళ్లిలాంటివి నా మీద పెద్దగా ప్రభావం చూపించవు'' అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తిరిగి సినిమాల్లోకి వచ్చాక ఓ ఇంటర్వ్యూలో ఇలా ధైర్యంగా చెప్పింది ఆర్తి అగర్వాల్‌. అయినా విధికి తలవంచింది. ఈ నేపధ్యంలో సినిమా వారి మధ్య ఆమె గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఆమెతో పరిచయమున్నవారు...మాట్లాడుకునే మాటల్లోని సారాంశంతో ఈ స్టోరీ అందిస్తున్నాం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కేవలం అదృష్టం ఆమెని హీరోయిన్‌ని చేసింది. తొలి సినిమానే సూపర్‌హిట్టయిపోయింది. రెండో సినిమా... మూడో సినిమా... హిట్టుమీద హిట్టు. అలా విజయాలు ఆర్తిని ఈజీగానే పలకరించాయి. అంతే ఈజీగా స్టార్‌ అయిపోయింది. ఆ తర్వాత పరాజయాలూ ఈజీగానే చుట్టుముట్టాయి. కానీ... గెలుపుని ఆహ్వానించినంత ఈజీగా పరాజయాన్ని స్వీకరించలేకపోయింది.

గోడక్కొట్టిన బంతిలా అంతే వేగంగా వెనక్కొచ్చేసింది. ఈ మార్పు వూహించలేకపోయింది. ఆ రెండింటికీ పరిశ్రమ తనపై చూపించిన తేడాని జీర్ణించుకోలేకపోయింది. హీరోయిన్ అవడానికి ఎలాంటి కష్టాలూ పడకపోయినా... ఆ స్థానాన్ని నిలబెట్టుకోడానికి, మళ్లీ తాను నిరూపించుకోడానికి... ఏళ్లకు ఏళ్లుగా శ్రమించింది...ఈ లోగా అర్దాంతరంగా అందరానిలోకాలకి వెల్లిపోయింది.

స్లైడ్ షో లో...ఐదు పొరపాట్లు...

ధైర్యంగా ఉండలేకపోయింది

ధైర్యంగా ఉండలేకపోయింది

చిన్నవయస్సులో వచ్చిన సమస్యలతో పోరాడలేకపోయింది. మానసిక ధైర్యాన్ని కోల్పోయింది. అప్పుడే ఆత్మహత్యే మార్గం అనుకుంది. అదే ఆమె మొదటి పొరపాటు అంటారు అభిమానులు

పీఆర్ లేదు

పీఆర్ లేదు

నటీ,నటులుకు గ్లామర్ ఫీల్డ్ లో పీఆర్ అతి ముఖ్యమైనది. ఆమెలో పాజిటివ్ సైడ్ ని బయిటపెట్టే పీఆర్ ...ఆమె కెరీర్ కు ఖచ్చితంగా ఉపయోగపడేది. అయితే అది జరగలేదు.

నేచురల్ గా ప్రయత్నించలేదు

నేచురల్ గా ప్రయత్నించలేదు

బరువు పెరిగినప్పుడు ఆమె సహజ పద్దతుల ద్వారా బరువు తగ్గాలని ప్రయత్నిస్తే బాగుండేది. అయితే ఆమె లైపోని ఆశ్రయించింది. అదీ అర్జెంటుగా అంటారు.

వద్దన్నా

వద్దన్నా

హైదరాబాద్ కు చెందిన సర్జన్ ఆమెను లైపోకు వద్దన్నా ..ఆమె ఆ ఆలోచను విడనాడకుండా న్యూ జెర్శీలో ప్రయత్నించింది.

టీనేజ్ సమస్యలు

టీనేజ్ సమస్యలు

టీనేజ్ లోనే ఆమె ఫీల్డ్ కువచ్చేయటంతో ఆమె తేలిగ్గా ఆకర్షణలకు లొంగిపోయింది. యంగ్ హీరో తరుణ్ తో ప్రేమలో పడిపోయింది. తర్వాత అతన్నుంచి దూరమై తట్టుకోలేకపోయింది.

సరైన డెషిషన్స్ లేవు

సరైన డెషిషన్స్ లేవు

డౌన్ ఫాల్ ప్రారంభమయ్యాక ఆమె దాన్ని సరిదిద్దుకుని సరైన దారిలోకు పెట్టుకునే ప్రయత్నాలు చేయకుండా రెప్యుటేషన్ చెడిపోయేలా వచ్చిన ప్రతీ ఆఫర్ ను సైన్ చేసుకుంటూ పోయింది.

వివాదాలు

వివాదాలు

ఆర్తి జీవితాన్ని వివాదాలు కొన్నాళ్లు ఇబ్బందులు పెట్టాయి. మార్చి 23, 2005న ఆర్తి ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ యువనటుడితో ఆమె సాగించిన ప్రేమాయణమే దీనికి కారణమని వార్తలొచ్చాయి.

అప్పుడూ ఆత్మహత్యే...

అప్పుడూ ఆత్మహత్యే...

ఆ తర్వాత ఫిబ్రవరి 15, 2006లో మెట్లు ఎక్కుతుండగా జారిపడి గాయాలపాలైంది. ఇది కూడా ఆత్మహత్య ప్రయత్నమేనన్న వదంతులు వచ్చాయి. తర్వాత ఆర్తి సినీ జీవితం దెబ్బతింది.

ఆ బంధమూ నిలవలేదు

ఆ బంధమూ నిలవలేదు

నవంబర్‌ 22, 2007న ఉజ్వల్‌ కుమార్‌ అనే ఎన్‌ఆర్‌ఐని వివాహమాడింది ఆర్తి. ఈ బంధమూ ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్త్లెన కొద్ది నెలల్లోనే వీరు విడిపోయారు.

ఫెయిల్యూర్ సినిమాలు

ఫెయిల్యూర్ సినిమాలు

పెళ్లయ్యాక కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సత్ఫలితాలివ్వలేదు.

ఆమె చేతిలో ...

ఆమె చేతిలో ...

ప్రస్తుతం ఆమె 'జంక్షన్‌లో జయమాలిని', 'ఆమె ఎవరు?' సినిమాలు అంగీకరించింది. ఆమె నటించిన 'రణం 2', 'ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

నివాళి

నివాళి

'నువ్వు నాకు నచ్చావ్‌' అంటూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్న నటి ఆర్తి అగర్వాల్‌.. జీవితం అర్ధాంతరంగా ముగిసింది. చిన్నవయస్సులోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చి అన తికాలంలోనే అగ్రనటుల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని తారాపథంలో దూసుకెళ్లిన ఆర్తి(31) అమెరికాలోని న్యూజెర్సీలో ఆకస్మికంగా మరణించారు. ఇది ఆమె అభిమానులకే కాక మానవత్వమున్న ప్రతి ఒక్కరినీ భాధించింది.

English summary
Actress Aarti Agarwal' infamous relationship-break with actor Tarun, suicide attempt, mysterious fall from the building, coma and her marriage-divorce, everything is being talked about once again. Apparently, it is obvious to discuss if's and but's when an unfortunate incident like this happens and the same is being done in the actress's case too.
Please Wait while comments are loading...