Just In
- 49 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
Corona Vaccine: మీ వ్యాక్సిన్ పై ప్రజలకు నమ్మకం ఉందా ?, అమ్మ పెట్టదు, అడుక్కుతిన్నీయ్యదు, ఇదే !
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్, రాజమౌళి సినిమాల్లోనూ తప్పిదాలు (ఫోటోస్)
హైదరాబాద్: మనం సినిమా చూసేప్పుడు కేవలం హీరో హీరోయిన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై మాత్రమే దృష్టి పెడతాం. కానీ చిత్రీకరణ సమయంలో సినిమాల్లో దొర్లే మిస్టేక్స్ మన దృష్టికి రావు. ఇవేమీ అంత సీరియస్ మిస్టేక్స్ కాక పోయినా......నిశితంగా పరిశీలిస్తే ఫన్నీగా అనిపిస్తుంది.
మామూలు దర్శకుల సినిమాలు మాత్రమే కాదు....స్టార్ దర్శకుల సినిమాల్లో కూడా ఇలాంటి ఫన్నీ మిస్టేక్స్ చోటు చేసుకుంటుండం గమనార్హం. అయితే ఇదంతా సినిమాకు పని చేసే సిబ్బంది చేసే పొరపాట్ల వల్లనే అని చెప్పక తప్పదు. అందుకు సంబంధించిన ఫోటోలు మీ ముందుకు తెస్తున్నాం. ఫన్నీగా ఓ లుక్కేయండి.

అత్తారింటికి దారేది చిత్రంలో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది' చిత్రంలోని క్లైమాక్స్ సీన్లో జరిగిన మిస్టేక్ ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు.

శివాజీ మూవీలో..
రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో వచ్చిన శివాజీ మూవీలో వెంట వెంటనే వచ్చే షాట్లలో ఇలా మిస్టేక్స్ దొర్లింది.

తుపాకి సినిమాలో...
విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చోటే చేసుకున్న చిన్నపాటి తప్పిదం.

రాజమౌళి ‘ఈగ' చిత్రంలో..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రంలో చోటు చేసుకున్న మిస్టేక్ ఇది. ట్రిగ్గర్ నొక్కకుండానే గన్ పేలింది.

తమన్నా...
ఈ సీన్ చూడండి....తమన్నా జండూబామ్ మూత తీసి పెట్టేలోగా చేతి గోళ్ల రంగు మారిపోయింది.

శివాజీ సినిమాలో...
శివాజీ సినిమాలోని ఓ ఫైట్ సీన్లో ఇలా....ఒకే సీన్లో గడియాంలోని టైం వేర్వేరుగా కనిపించింది. దీన్ని బట్టి ఈ ఒక్క సీన్ వేర్వేరు సమయాల్లో చిత్రీకరించనట్లు స్పష్టమవుతోంది.

సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో...
సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలోని ఈ సీన్ 1980 బ్యాక్ డ్రాపుకు సంబంధించినది. మరి ఆ కాలంలో సీసీకెమరాలు ఎక్కడి నుండి వచ్చాయో?

ఒకే సీన్ డిఫరెంటు ప్రదేశాల్లో...
సినిమాలో మనకు కనిపించేది ఒకే ప్రదేశంలో ఉండే సీన్. చిత్రీకరించింది మాత్రం వేర్వేరు ప్రదేశాల్లో. ఆ తేడా ఇక్కడ స్పస్టంగా కనిపిస్తోంది. ధనుష్, తాప్సీ కలిసి నటించిన పందెకోళ్లు చిత్రంలోనిది ఈ సీన్.

టైం చూసుకోవాలి బాసూ...
ఒకే సీన్ వేర్వేరు సమయాల్లో చిత్రీకరించడం వల్ల వచ్చిన తేడా ఇది. అందుకు ఈ సీన్లో కనిపిస్తున్న గడియారమే నిదర్శనం.

చెన్పై ఎక్స్ ప్రెస్ సీన్లో...
చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో....ప్రయాణం అంతా స్లీపర్ క్లాస్ బోగీలో సాగినట్లు, మీనమ్మ వీలేజిలో దిగేపుడు జనరల్ బోగీ నుండి దిగుతున్నట్లు చూపించారు.

ఫోన్ ఉల్టా...పల్టా
ఈ సీన్ చూడండి ఫోన్ తిప్పి పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్లో కనిపిస్తున్న కెమెరానే అందుకు నిదర్శనం.

విజయ్ సినిమాలోని సీన్
ఈ సీన్ చూడండి. హీరో విజయ్ బాటిల్‌లో కోక్ మొత్తం తాగే విసిరాడు. కానీ అది బద్దలయ్యేపుడు మళ్లీ అందులో కోక్ ఉన్నట్లు చూపించారు.

ఫస్ట్ సీన్..నెక్ట్స్ సీన్
ఫస్ట్ సీన్...నెక్ట్స్ సీన్ తేడాను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు.