twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిథున్‌ చక్రవర్తికి అనారోగ్యం, లాస్ ఏంజిల్స్ లో ట్రీట్ మెంట్

    By Srikanya
    |

    ముంబయి: తన డాన్స్ లలో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన బాలీవుడ్ డిస్కో కింగ్ మిథున్‌ చక్రవర్తి సంవత్సరకాలంగా ఎక్కడా కనపడటం లేదు. బాలీవుడ్ పార్టీలలో కానీ , మరొక ఈవెంట్ లలో కూడా పాల్గొనటం లేదు. దాంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయం నిజమేనని ఆయన మేనేజర్ విజయ్ ఖరారు చేసారు.

    విజయ్ చెప్పేదాన్ని బట్టి మిధున్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాల క్రితం మిథున్‌ లాస్‌ఏంజెల్స్‌కి వెళ్లారు. ప్రస్తుతం దాదా(మిథున్‌) ముంబయిలో లేరని ఆయన లాస్‌ఏంజెల్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని కనీసం ఫోను కూడా వాడటం లేదని ఆయన మేనేజర్‌ విజయ్‌ మీడియాకు వెల్లడించారు. మిథున్‌ నెల తర్వాతే ముంబయి వస్తారని పేర్కొన్నారు.

    అదీకాకుండా మిథున్‌ 2009లో 'లక్‌' చిత్రంలో నటిస్తున్నప్పుడు హెలికాప్టర్‌ నుంచి కిందకి దూకాల్సిన సన్నివేశం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దాంతో ఆయన కాలికి తీవ్ర గాయం అయింది. అప్పటికి గాయం పూర్తిగా మానిపోయినా నెలరోజుల క్రితం మళ్లీ నొప్పి మొదలైందని మేనేజర్‌ విజయ్‌ తెలిపారు.

    Mithun Chakraborty unwell, currently in Los Angeles

    ఇక మిధున్ ..తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కూడా కావటంతో ఆ మధ్యన ఆయన వరుసగా రాజ్యసభ సమావేశాలకు గైర్హాజరటం జరిగింది. ఆయన ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ సమావేశాలను హాజరుకాలేనంటూ రాజ్యసభకు లేఖ రాస్తూ వస్తున్నారు. అయితే ఓ సారి మాత్రం అభ్యంతరాలు సభలో వచ్చాయి. ఓ సారి ఎప్పటిలాగే డిప్యూటీ స్పీకర్ పి.జె.కురియన్ ఆ లేఖను సభలో చదివి వినిపించారు. దీనిపై సవాజ్‌వాది పార్టీ నేత నరేష్ అగర్వాల్ అభ్యంతరం లేవనెత్తారు.

    దేనికైనా ఒక పరిమితంటూ ఉండాలి. ఏ మనిషైనా ఆరోగ్యం సాకు చూపి ఎన్నాళ్లు సెలవు తీసుకోగలుగుతారు? ప్రతి సమావేశానికి ముందు మిథున్ నుంచి లెటర్ వస్తుంది. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంటారు. ఒక సమావేశానికి అయితే సరిపుచ్చుకోవచ్చు. ప్రతీసారీ ఆయన ఇలాగే చెబుతున్నారు. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.

    చైర్మన్ దీనిపై రూలింగ్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుపట్టారు. మెడికల్ రిపోర్టులు కూడా మిథున్ సమర్పించినప్పుడు అభ్యంతరాలు ఎందుకు ఉండాలంటూ టిఎంసి నేత సుఖేందు శేఖర్ రాయ్ ఎదురు ప్రశ్నించారు. దీంతో కురియన్ జోక్యం చేసుకుంటూ, ఒక సభ్యుడు తాను అనారోగ్యంగా ఉన్నానని చెబితే కాదనలేమని అన్నారు. మిథున్ అభ్యర్థనను ఆమోదిస్తున్నట్టు సభలో ప్రకటించారు.

    ఇక మిధున్ ... తెలుగులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ లు కైలిసి నటిస్తున్న హింది రీమేక్ 'ఓ మై గాడ్' సినిమా గోపాల గోపాలలో కనిపించారు. ఆయన నటనకు మంచి ప్రంశసలు వచ్చాయి.

    ఆయన త్వరగా కోలుకోవాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది. అభిమానులైన మీరు కూడా ఆయన త్వరగా కోలుకుని ఇంటికి రావాలని కోరుకోండి. మీ స్పీడ్ రికవరీ విషెష్ ని క్రింద కామెంట్స్ కాలమ్ ద్వారా తెలియచేయండి.

    English summary
    Mithun Chakraborty, who ruled Bollywood in the 80s, is not keeping well.While rumours were buzzing about his ill health, his manager confirmed the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X