తణికెళ్ల భరిణి 'మిథునం' ఆడియో విడుదల
ప్రముఖ రచయిత, నటుడు తణికెళ్ల భరిణి 'మిథునం'అనే ఓ ఫీచర్ ఫిల్మ్ ని డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో అమెరికాలో జరగనుంది. న్యూయార్క్ లో మార్చి 31 వ తేదీన, డల్లాస్ లో ఏప్రియల్ 1న, న్యూ జర్సీలో ఏప్రియల్ 7న జరుగనుంది. ఇక ఈ చిత్రంతో భరిణి పూర్తి స్ధాయి ఫీచర్ ఫిల్మ్ దర్సకత్వంలోకి దిగుతున్నారు. శ్రీరమణ రాసిన 'మిథునం'కథ ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వావిలవలస గ్రామంలో సన్నివేశాల్ని తెరకెక్కించారు. 'మిథునం' చిత్రానికి వీణాపాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక గతంలో భరిణి 'సిరా', 'కీ', 'బ్లూ క్రాస్' లాంటి లఘు చిత్రాలు రూపొందించి పురస్కారాలు అందుకొన్నారు.
'మిథునం' పూర్తిస్థాయి చలనచిత్రం. ఈ చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యంని కీ రోల్ కి తీసుకున్నారు కాబట్టి పాటలకు కూడా ప్రాధాన్యత ఉండేలా చేస్తారేమో చూడాలి. రీసెంట్ గా ఎస్పీ బాలసుబ్రమణ్యం..దేవస్దానం అనే చిత్రంలో సైతం చేసారు. జనార్ధన మహర్షి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











