పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కొమరం పులి చిత్రానికి కార్పోరేట్ సంస్ధల మధ్ధతు లభిస్తోంది. ఈ చిత్రంలో పవన్ వాడే Pajero వెహికల్ ని Mitsubishi మోటార్స్ వారు ప్రత్యేకంగా డిజైన్ చేసి అందిస్తున్నారు. అలాగే రిలియన్స్ కమ్యూనికేషన్ వారు తమ బ్రాండ్ ప్రమేషన్ కోసం పబ్లిసిటీ పార్టనర్ గా చేరనున్నారు. అందు నిమిత్తం రిలియన్స్ వారు అవుట్ డోర్ పబ్లిసిటి కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు.ఇది కనుక సక్సెస్ అయితే మరిన్ని చిత్రాలకు ఇటువంటి ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది. దాంతో చాలామంది పవన్ కళ్యాణ్ ని మెచ్చుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఖుషి ఫేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.