twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లోక్‌సభ బరిలో గెలిచిన, ఓడిన సినీ ప్రముఖులు (ఫొటొ ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: పదహారో సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది సినీ ప్రముఖులు పలు పార్టీల నుంచి పోటీ చేశారు. వారిలో కొందరు విజయం సాధించగా, మరికొందరు అపజయం పొందారు.

    ముఖ్యంగా సినిమా వారికి గ్లామర్ అనేది ప్లస్ అవుతుంది. ఈ నేపధ్యంలో వారు గెలిచారా,ఓడారా అన్నది అందరిలో ఆసక్తి లేపే అంశం. అయితే సినిమా వారి కన్నా ఎక్కువగా ప్రజలు దేశ,రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువగా భావించి ఓటేయటం జరిగింది. మనకు పవన్ వంటి వారు నిలబడకుండా ప్రచారం మాత్రమే చేసారు.

    లోక్ సభ బరిలో సినిమా వాళ్లు పరిస్ధితి ఏమిటో స్లైడ్ షోలో చూద్దాం...

    శివప్రసాద్

    శివప్రసాద్

    ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు ఎంపీ, తెదేపా అభ్యర్థి శివప్రసాద్‌ తిరిగి ఘన విజయం సాధించారు. ఈయన దర్శకుడుగా, సినీ నటుడుగా సుప్రసిద్దులు. టీవి పోగ్రామ్ లు సైతం చేసారు. చేస్తున్నారు.

    మురళీ మోహన్

    మురళీ మోహన్

    రాజమండ్రిలో తెదేపా అభ్యర్థి మాగంటి మురళీమోహన్‌ ఘనవిజయం సాధించారు. మురళి మోహన్ ఎన్నో చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. నిర్మాతగా కూడా ఆయన జయభేరీ బ్యానర్ పై సుప్రసిద్దులు.

    కిరణ్ ఖేర్, గుల్ పనాగ్

    కిరణ్ ఖేర్, గుల్ పనాగ్

    చండీగఢ్‌ నుంచి భాజపా అభ్యర్థి ప్రముఖ సినీ నటి కిరణ్‌ఖేర్‌ ఘన విజయం సాధించారు. ఆమె పవన్‌కుమార్‌ బన్సాల్‌పై 1,91,362 ఆధిక్యంతో గెలుపొందారు. ఇదే నియోజకవర్గంలో సినీ నటి, ప్రముఖ మోడల్‌, ఆప్‌ అభ్యర్థి గుల్‌పనాగ్‌ చిత్తుగా ఓడిపోయారు.

    శత్రుఘ్నసిన్హా

    శత్రుఘ్నసిన్హా

    పాట్నా సాహిబ్‌ నుంచి భాజపా తరపున పోటీ చేసిన శత్రుఘ్నసిన్హా ఘన విజయం సాధించారు. ఈయన ప్రముఖ నటి సోనాక్షి సిన్హా తండ్రి. శత్రుఘ్నసిన్హా నటన గురించి తెలియని వారు అరుదు. ఆయన రక్త చరిత్రం చిత్రంలో సైతం కనిపించి అలరించారు.

    పరేష్ రావెల్

    పరేష్ రావెల్

    అహ్మదాబాద్‌(తూర్పు) నుంచి, భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు పరేశ్‌రావల్‌ ఘనవిజయం సాధించారు. పరేష్ రావెల్...తెలుగులో మనీ, వంటి చిత్రాలే కాక శంకర్ దాదా ఎమ్ బి బియస్ వంటి సినిమాలు చేసారు.

    మున్‌మున్‌సేన్‌

    మున్‌మున్‌సేన్‌

    తృణమూల్‌ తరపున బంకురాలో పోటీ చేసిన హీరోయిన్ మున్‌మున్‌సేన్‌ 3,09,274 ఓట్లతో ఘన విజయం పొందారు. ఆమె తెలుగులో సిరివెన్నెల చిత్రంలో నటించారు.

    హేమామాలిని

    హేమామాలిని

    ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి భాజపా తరపున పోటీ చేసిన అలనాటి అందాల నటి హేమామాలిని విజయం సాధించారు.

    మహేష్‌ మంజ్రేకర్, రాఖీ సావంత్

    మహేష్‌ మంజ్రేకర్, రాఖీ సావంత్

    ముంబై వాయువ్యం నుంచి పోటీ చేసిన సినీ ప్రముఖులు మహేష్‌ మంజ్రేకర్‌, కమాల్‌ రషీద్‌ఖాన్‌, రాఖీ సావంత్‌లు ఓడిపోయారు. రాఖీసావంత్‌కు 1586 ఓట్లు లభించాయి. మహేష్‌ మంజ్రేకర్ తెలుగులో అదుర్స్, ఒక్కడున్నాడు వంటి అనేక చిత్రాలు చేసారు. రాఖీ సావంత్ తెలుగులో ఐటం సాంగ్ సైతం చేసింది.

    నగ్మా

    నగ్మా

    మీరట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన సినీ నటి నగ్మా పరాజయం పొందారు.

    బప్పీలహరి

    బప్పీలహరి

    శ్రీరాంపూర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ గాయకుడు బప్పీలహరి ఓటమి పాలయ్యారు. బప్పీలహరి తెలుగులో అప్పట్లో గ్యాంగ్ లీడర్ వంటి సూపర్ హిట్స్ కు సంగీతం అందించారు. బాలీవుడ్ లో ఆయనదో శకం.

    జయప్రద

    జయప్రద

    ఆర్‌ఎల్డీ బిజ్‌నోర్‌ అభ్యర్థి జయప్రద భాజపా అభ్యర్థి కున్వర్‌ భరద్వాజ్‌ చేతిలో ఓడిపోయారు. ఆమెకు 24,348 ఓట్లు లభించాయి.

    ఇంకా...

    ఇంకా...

    (సౌమిత్రీ రాయ్)
    బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి భాజపా తరఫున పోటీ చేసిన ప్రముఖ గాయకుడు బాబులాల్‌ సుప్రియా 4,19,668 ఓట్లు పొంది ఘనవిజయం పొందారు. మిడ్నాపూర్‌ నుంచి నటి సంధ్యారాయ్‌, బీర్భమ్‌లో శతాబ్దిరాయ్‌, ఘటల్‌ నుంచి యువ కథానాయకుడు ఇంద్రనీల్‌ సేన్‌ తృణమూల్‌ నుంచి ఘన విజయం పొందారు. మాల్దాలో తృణమూల్‌ నుంచి పోటీ చేసిన సౌమిత్రీ రాయ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మౌసమ్‌నూర్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.

    English summary
    The film fraternity had mixed luck at the hustings with BJP nominees Hema Malini, Kirron Kher and Paresh Rawal, Trinamool's Monmoon Sen and Independent candidate Innocent making their Lok Sabha debut while some like Raj Babbar, Nagma, Gul Panag and Jaya Prada bit the dust.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X