'సింహాద్రి', 'బొమ్మరిల్లు' కలిపితే వచ్చిందే 'బృందావనం'
'బృందావనం' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'సింహాద్రి', 'బొమ్మరిల్లు' కలిపితే 'బృందావనం' అంటూ ఎన్టీఆర్ తాజాగా తెలుగులోని ఓ లీడింగ్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రం చేయటానకి కారణం చెబుతూ... స్వతహాగా నాకు 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారు లోకం' లాంటి సినిమాలంటే చాలా ఇష్టం. కానీ చేయలేను. ఎంత కొత్తదారిలో వెళ్దామనుకొన్నా నా ఇమేజ్‌ని మరచిపోకూడదు కదా! అదెప్పుడూ మెడ మీద కత్తిలా నా కర్తవ్యం గుర్తుచేస్తుంటుంది. ఆ రెండింటినీ కలుపుకోవాలి.అందుకే రెండూ కలసినట్లుండే 'బృందావనం' చేసానన్నారు.
ఇక తన క్యారెక్టర్ గురించి చెబుతూ..గోవిందుడు ఎంత అల్లరివాడో తెలిసిందే కదా! తెర మీద కూడా అలాగే ఉంటాడు. నా తరహా సన్నివేశాలు చాలానే ఉంటాయి. 'పట్నం నుంచి వచ్చాడు. లవర్ బోయ్‌లా కనిపిస్తున్నాడు అనుకోకండి. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల మాస్ అలానే ఉంది. వాడు బయటకు వచ్చాడో రచ్చ రచ్చే' అనే డైలాగుతోనే నా పాత్ర స్వభావం తెలిసిపోతుంది. నవరసభరితమైన కథ ఇది. దర్శకుడు వంశీ తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుంది. నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో ఇష్టంతో ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దారు.లుక్ మారుతుందని మీసాలు తగ్గించి... కాస్ట్యూమ్స్ తీరు కూడా మార్చాం అన్నారు. ఇక బృందావనం చిత్రం ఈ నెల 14 న విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications











