వేలాది జనం మధ్య బాలయ్య కేక

By Srikanya

రాజకీయ నేపథ్యంలో (కర్నూల్‌) వేలాది జనాల మధ్య బాలయ్యతో చేసిన ఓ పాట హైలైట్‌ అంటున్నారు ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి.బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తికంబైన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 20న యూరప్‌ వెళుతున్న సందర్భంగా నిర్మాత ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి మాట్లాడుతూ ''ప్రస్తుతం కర్నూలులో చిత్రీకరణ సాగుతోంది. ఈ షూటింగ్‌తో.. 2పాటలు, 4రోజుల టాకీ మినహా సినిమా పూర్తవుతుంది. బాలయ్య స్థాయికి తగ్గని రీతిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. హీరో 3 వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. పాత్రలు మారేప్పుడు..ఆశ్చర్యకర రీతిలో నటనా వ్యత్యాసం చూపిస్తున్నారు. దర్శకుడు మురళి మా సంస్థకు 3హిట్‌లు ఇచ్చారు. తన ప్రతిభ సహా కళ్యాణి మాలిక్‌ సంగీతం అలరిస్తుంది. రాజకీయ నేపథ్యంలో (కర్నూల్‌) వేలాది జనాల మధ్య బాలయ్యతో చేసిన ఓ పాట హైలైట్‌. యాక్షన్‌, సెంటిమెంట్‌, కుటుంబ డ్రామా, కామెడీ..ఇలా అన్ని అంశాలతో తెరకెక్కుతోంది"" అన్నారు.

మరో ప్రక్క దర్శకుడు పరుచూరి మురళి... “ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. ఈ సినిమాని కీర్తి కంబైన్స్ పతాకం పై ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ అధినాయకుడు శ్రీరామరాజ్యం విడుదల అయిన రెండు నెలల గ్యాప్ లోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది. అంటే శ్రీరామరాజ్యం రిలీజ్ కాకముందే అధినాయకుడు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు ముస్తాబు అవుతుంది. లక్ష్మీరాయ్‌, సలోని కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్‌, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌, ఆదిత్యమీనన్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: కళ్యాణిమాలిక్‌, కెమెరా: జయ్‌.సి.కుమార్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X