అంచనాలు పెంచిన ‘ఎంఎల్ఏ’ మూవీ మేకింగ్ వీడియో
కళ్యాణ్ రామ్, కాజల్ హీరో హీరోయిన్లుగా టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం 'ఎంఎల్‌ఎ'. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
కళ్యాణ్ రామ్, కాజల్, రవి కిషన్, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి సమర్పణ : టీజీ విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ, సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్: తమ్మిరాజు , సమర్పణ : టీజీ విశ్వప్రసాద్, కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : సీ భరత్ చౌదరి, యంవీ కిరణ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.


Click it and Unblock the Notifications











