బ్లూ ఫిలింలో నటించానని సీడీలు.. చంద్రబాబు ఏడుపుపై సినీ నటి రోజా సంచలన వ్యాఖ్యలు
ఏపీ అధికార వైఎస్ఆర్సీపీలో చరిష్మా గల మహిళా నేతగా, ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా తన మార్క్ చూపిస్తూనే.., అటు బుల్లితెరపైనా జబర్దస్త్ ప్రోగ్రాం తో హవా కొనసాగిస్తున్నారు ఆర్కే రోజా. ఆమె ఎక్కడికెళ్లినా ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తారు. అలాంటి ఆమె ఈరోజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం మీద స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోగా
జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెరపై నవ్వులు పూయించే రోజా అధికార పార్టీలొ చాలా కీలకం. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ముందు నుంచి టీడీపీలో పని చేసిన ఆమె ఇప్పుడు వైసీపీలో చేరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈరోజు జరిగిన పరిణామాలతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోగా దాని మీద రోజా స్పందించారు.

రోజా బ్లూ ఫిలిమ్స్ లో
చంద్రబాబు విధి ఎవరిని విడిచి పెట్టదు, అందరి సరదా తీరుస్తుంది, 72 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ని ఎంత ఏడిపించారు, గుర్తుందా? 71వ సంవత్సరం ఏడు నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది మనకు తిరిగి వస్తుంది అని, ఏదో మీ భార్యని అనేసారు అని తెగ బాధపడిపోతూ ఉన్నావు, మరి ఆరోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూ ఫిలిమ్స్ లో నటించింది అని మీ ఎమ్మెల్యే పీతల సుజాత తో మీడియా పాయింట్ లో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? అని ఆమె ప్రశ్నించారు.

మాకు గౌరవం లేదా?
అంటే నాకు ఒక కుటుంబం లేదు నాకు పిల్లలు లేరు మాకు గౌరవం లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా అంటావు, అప్పుడు విజయమ్మను ఎంత ఏడిపించావు? భారతమ్మ గురించి ఎన్ని మాట్లాడావు? షర్మిలమ్మ ని ఏవిధంగా కించపరిచారో, ఎవరూ మరిచిపోలేదు. అని రోజా పేర్కొన్నారు. కాబట్టి ఈరోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడ్పులు ఏడ్చిన నిన్ను ఎవరు జాలితో చూడరు అని తెలుసుకో అని అన్నారు..

ఎన్ని మాట్లాడావు?
ఎందుకంటే ప్రధాని మోడీ తో సహా ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావు? నీ సోషల్ మీడియా తో ఎన్ని పుకార్లు స్ప్రెడ్ చేశావు? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళ అని కూడా చూడకుండా, నీ కోసం కొన్ని సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నన్ను చూడకుండా, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారనమి అనరు.

ఎవరూ మరిచిపోలేదు
రూల్స్ కు వ్యతిరేకంగా నన్ను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు, మహిళా పార్లమెంటుకు పిలిచి 24 గంటల పాటు అనుమతి లేదని చెప్పి నా మానసిక క్షోభకు మీరు కారణం అయ్యారు. అక్కడ తీసుకువచ్చి హైదరాబాద్ లో నన్ను విసిరి పారేసిన విషయం ఎవరూ మరిచిపోలేదు అని ఆమె అన్నారు.
నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈరోజు నీకు తగిలింది, అందరి ఉసురు తగిలి ఈరోజు నువ్వు ఇలా అయిపోయావని అన్నారు.
Recommended Video

మరిచిపోయావా?
నన్ను అయితే రూల్స్ కి విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేయగలిగారు , దేవుడు నిన్ను ఒకటిన్నర సంవత్సరం కాదు కదా జీవితంలోనే అసెంబ్లీలో అడుగు పెట్టని విధంగా నీకు నువ్వే శపధం చేసుకున్నావు. బై బై బాబు అంటూ కామెంట్ చేశారు.ఇక కర్మ ఫలితం అనుభవించు బాబు, అధికారం చేతిలో ఉందని మహిళలు అని కూడా చూడకుండా నాడు నన్ను, జగనన్న కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురి చేసింది మరిచిపోయావా? నీ దొంగ ఏడుపులు రాష్ట్ర ప్రజలు నమ్మరు బాబు అని ఆమె పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











