twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమ్మెల్యేలపై వర్మ సెటైర్లు... మా రక్తం మరుగుతోందంటున్న ఫ్యాన్స్

    |

    Recommended Video

    RGV Satirical Comments On AP Assembly Sessions | Filmibeat Telugu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై చాలా సంతోషంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ... ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

    జగన్ అధికారంలోకి వచ్చాక తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా విడుదల చేసిన వర్మ త్వరలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును పదవి నుంచి దించడానికి జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నాడనేది ఈ చిత్రంలో చూపిస్తారని తెలుస్తోంది.

    ఎమ్మెల్యేల తీరుపై వర్మ అసంతృప్తి

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న తీరుపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు రామ్ గోపాల్ వర్మ తాజా ట్వీట్స్ బట్టి తెలుస్తోంది. ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల్లా వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేయడానికి స్పీకర్ బెల్ మ్రోగిస్తున్నారని వర్మ ట్వీట్ చేశారు.

    మీటింగ్స్ పెట్టింది అరుచుకోవడానికేనా?

    అసెంబ్లీ సమావేశాలు జరిగేది పాత ఇష్యూలపై ఒకరిపై ఒకరు అరుచుకోవడాని, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడానికి, నిందలు వేసుకోవడానికా?..... లేక ప్రస్తుత సమస్యలు, భవిష్యత్ గురించి చర్చించడానికా? అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.

    మాకు రక్తం మరుగుతుంది అధ్యక్షా

    మాకు రక్తం మరుగుతుంది అధ్యక్షా

    వర్మ చేసిన ఈ ట్వీట్ మీద ఫ్యాన్స్ రకరకాలుగా స్పందించారు. ‘‘వర్మ గారు అలా అడిగితే ఎలా మాకు రక్తం మరుగుతుంది అధ్యక్షా'' అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టగా, దానికి మరొరు స్పందిస్తూ ‘‘భయ్యా, ఇందులో రక్తం మరిగే అంత విషయం ఏమి ఉంది, మన అసెంబ్లీ సమావేశాలు అలాగే ఉంటాయని చెపుతున్నాడు. గొడవలు లేకుండా అసెంబ్లీ ఉండటం నేను చూడలేదు.'' అని కామెంట్ పెట్టారు.

    వర్మగారూ.. ఇలా చేయడమే రైట్

    వర్మగారూ.. ఇలా చేయడమే రైట్

    ‘‘రామ్ గోపాల్ గారు, మొదటి అసెంబ్లీ‌ సమావేశాల్లో గత ప్రభుత్వాలను ఎండగడుతూ వారు చేసిన అక్రమాలు వెల్లడించిన పిదప ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేయబోతుందో తెలియజేస్తారు, ఆలా చేయకపోతే గత ప్రభుత్వ అక్రమాలు ప్రజలకు తెలియవు. ప్రస్తుతం జరుగుతున్న సభ సక్రమార్గంలోనే నడుస్తుంది.'' అని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడించారు.

    English summary
    "Except for going on ringing the bell does the Speaker do anything else? I guess the Speaker having a bell sounding like a school bell is quite appropriate because the MLA’s behave like scool kids anyway, Are the assembly sessions for shouting,blaming,complaining about past issues or to logically discuss current and future issues ? Just asking" RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X