‘బ్లాక్ మనీ’తో హీరో, 35మంది ఎమ్మెల్యేలు!
'బ్లాక్ మనీ"..ఈ పదం ఈ మద్య బాగా పాపులర్ అయింది. భారత దేశం తరచూ ఈ పదంతోనే వార్తల్లో నిలుస్తోంది. కారణం మన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కొందరు బిజినెస్ మ్యాన్స్ అక్రమంగా సంపాదించిన డబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడమే. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది.. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా అన్నాహాజారే లాంటి వారి స్పూర్తితో పోరాటాలు చేస్తున్నారు.
ఈ అంశాన్ని బేస్ చేసకుని...దాన్నే టైటిల్ పేట్టుకుని రూపొందుతున్న సినిమా 'బ్లాక్ మనీ". జగపతి బాబు, శివాజీ, సోనియా, అదితీ అగర్వాల్ ప్రధానపాత్రధారులు. పూసల రాధా దర్శకుడు. విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్-టి.రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. చివరి షెడ్యూల్‌కెళుతున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ '22నుంచి హైదరాబాద్ పరిసరాల్లో చివరి షెడ్యూల్ చేస్తున్నాం. నెలాఖరుకు దాదాపు పూర్తవుతుంది. నవంబర్‌లో నిర్మాణానంతర పనులు చేసి, అదే నెలలో సినిమా విడుదలచేస్తాం" అన్నారు.
నిజాయితీపరుడైన సీఎంగా రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, టీవీ యాంకర్‌గా సోనియా నటిస్తున్నారని, ఇంకొందరు మంత్రులు నిజజీవిత పాత్రలనే తెరపై ధరిస్తున్నారని, మొత్తం 30- 35మంది ఎమ్మెల్యేలు చిత్రీకరణలో పాల్గొ న బోతున్నారని..దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: డి.ప్రసా ద్‌బాబు, కథ-కథనం-దర్శకత్వం: పూసల రాధా.


Click it and Unblock the Notifications











