టక్కరి, యమదొంగ, మంత్రకే లాభాలు: కీరవాణి
ఇప్పటి వరకూ 27 ఆల్బమ్స్ తీసుకొస్తే మూడింటికే లాభాలొచ్చాయి. అవి... టక్కరి, యమదొంగ, మంత్ర చిత్రాలు అంటున్నారు కీరవాణి. ఆయన వేదం చిత్రానికి సంగీతం అందించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...ఆడియో మార్కెట్ గురించి మాట్లాడారు. అలాగేఆయన భార్య నిర్వహిస్తున్న వేల్ రికార్డ్స్ విషయం గురించి చెబుతూ...వరుసగా నష్టాలే వస్తుంటే ఎవరైనా ఆ వ్యాపారాన్ని ఆపేసుకొని వేరే వ్యాపారాన్ని చూసుకొంటారు. మరి గత పదేళ్లుగా ఆడియో మార్కెట్ బాగోలేదు అంటూనే ఉన్నారు. వ్యాపారం సాగుతూనే ఉంది. నా భార్య శ్రీవల్లి 'వేల్ రికార్డ్స్' పేరిట చేస్తున్నది పూర్తి వ్యాపార దృక్పథంతో కాదు. తపనతో. నేనేమీ ప్రత్యేకంగా సూచనలు, సలహాలూ ఇవ్వను అన్నారు. అలాగే ప్రేక్షకుల అభిరుచి గురించి చెబుతూ..శ్రోతల అభిరుచుల్లోనూ ఏమీ మార్పులేదు. కాకపోతే ఇప్పుడు కాస్త రిథమ్స్‌ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మెలోడీకి అప్పుడూఇప్పుడూ ఒకేలాంటి ఆదరణ ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











