రాజమౌళిపై అది తెలివితక్కువ ప్రశ్న : కీరవాణి
'రాజమౌళి సినిమాలకు మీ మ్యూజిక్ చాలా డిఫరెంట్, ప్రత్యేకంగా ఉంటుంది, మాకు అలాంటి మ్యూజిక్ ఎందుకు ఇవ్వడం లేదు అని కొందరు నన్ను అడిగారు... కానీ అది తెలివి తక్కువ ప్రశ్న, కీరవాణి నుంచి మీరు అలాంటి మ్యూజిక్ ఎలా రాబట్టుకుంటున్నారు అని రాజమౌళిని అడగాలి ఆ ప్రశ్న, అతనికి అంత టాలెంట్ ఉంది కాబట్టే నా నుంచి అలాంటి మ్యూజిక్ రాబట్టుకుంటున్నాడు ' అని చెప్పారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఈగ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్తదనాన్ని ఆహ్వానించడంలో రాజమౌళి ఎప్పుడు ముందుంటారని, అందుకే అతనికి ఆ సక్సెస్, అతను నాకంటే చిన్నవాడు ఎక్కవగా పొగడకుండా ఆశీర్వదిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
ఈగ చిత్రానికి సంగీతం సమకూర్చడంతో పాటు 'నేనే-నానీనే' అనే పాటకు లిరక్స్ కూడా అందించారు కీరవాణి. ఈ చిత్రం ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ఈగ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు. నాని, సమంత హీరోయి హీరోయిన్లుగా, కన్నడ సూపర్ స్టార్ సుదీప్ విలన్ పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











