Oscar అవార్డ్ తర్వాత RRRకు అర్థం మార్చేసిన కీరవాణి.. కొత్త నిర్వచనం ఏంటంటే?

తెలుగు సినిమాను ఎల్లలు దాటించి ప్రపంచ శిఖరంపై నిలబెట్టిన దర్శక దిగ్గజం రాజమౌళి. ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన గతేడాది రూపొందించిన కళాఖండమే RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్బ్ యాక్టింగ్ తో అబ్బురపరచగా.. ఇందులోని సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. అందుకే ఇందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ (95th Academy Awards) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కించుకుంది. ఇప్పటివరకు RRR అంటే 'రౌద్రం రణం రుధిరం' అని మనకు తెలుసు. కానీ ఆస్కార్ అవార్డ్ తర్వాత దాని అర్థం మార్చేశారు ఎమ్ఎమ్ కీరవాణి.

పాట రూపంలో సంతోషం..

పాట రూపంలో సంతోషం..

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్స్ 95వ అకాడమీ వేడుకలు మార్చి 13న సోమవారం ఉదయం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో RRR చిత్రానికి పురస్కారం వరించిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డ్ రాగా.. జీ పైకి ఎక్కి మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. దీంతో యావత్ తెలుగు సినీ ప్రేక్షకలోకం సంతోషంలో మునిగిపోయింది. ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న ఎమ్ఎమ్ కీరవాణి తన సంతోషాన్ని పాట రూపంలో తెలియజేశారు.

 రిచర్డ్ కార్పెంటర్ సంగీతం..

రిచర్డ్ కార్పెంటర్ సంగీతం..

ఆస్కార్ అందుకున్న తర్వాత కీరవాణి సంతోషంగా, ఎమోషనల్ గా మాట్లాడి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన రిచర్డ్ కార్పెంటర్ సంగీతం వింటూ పెరిగానని, ఈరోజు ఆస్కార్స్ అవార్డు సాధించానని పేర్కొన్నారు. అలాగే కార్పెంటర్ పాట పాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజాగా రిచర్డ్ కార్పెంటర్ నుంచి కీరవాణికి ప్రశంసలు వచ్చాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినందుకు కీరవాణికి, చంద్రబోస్ కు రిచర్డ్ కార్పెంటర్ తోపాటు ఆయన పిల్లలు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కీరవాణి చాలా ఎమోషనల్ అయ్యారు.

 విశ్వంలో అద్భుతమైన బహుమతి..

విశ్వంలో అద్భుతమైన బహుమతి..


విశ్వంలో అద్భుతమైన బహుమతి..

ఇది నేను అస్సలు ఊహించలేదు. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఈ విశ్వంలోని అత్యంత అద్భుతమైన బహుమతి ఇది అని కీరవాణి సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే RRR సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దానిని వర్కింగ్ టైటిల్ గా మాత్రమే అనుకున్నారు. రాజమౌళి, ఎన్టీ రామరావు, రామ్ చరణ్.. వీరి ముగ్గురు పేర్లలో మొదటి అక్షరం ఆర్ తీసుకుని ఆర్ఆర్ఆర్ అని చెప్పారు. అయితే ఈ టైటిల్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లడంతో చివరిగా దాన్నే ఖరారు చేశారు.

స్టాండింగ్ ఓవేషన్..

స్టాండింగ్ ఓవేషన్..

అప్పుడు RRR అంటే 'రౌద్రం రణం రుధిరం'గా నిర్వచనం ఇచ్చారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనేది ఒక సినిమా కాకుండా భారతీయ చిత్రసీమ గర్వించే తెలుగు ప్రేక్షకుల ఎమోషన్ గా మారింది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో భారతీయులందరూ గర్వ పడుతున్నారు. ముఖ్యంగా ఆస్కార్ వేదికపై తెలుగు పాట వినిపించడం, దానికి డ్యాన్స్ చేపించడం, ఆ పాటకు వరల్డ్ వైడ్ గా వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం తెలుగు చిత్రసీమకు మర్చిపోలేని క్షణాలు.

చరిత్ర సృష్టించేలా మద్దతు..

అయితే ఇప్పుడు RRRకు నిర్వచనం మారింది. 'రౌద్రం రణం రుధిరం' కాకుండా కొత్త అర్థం చెప్పారు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి. RRRకు 'రిటర్న్ హోమ్.. రిసీవ్ యువర్ లవ్.. రిజాయిస్' అని సరికొత్త అర్థం చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. "ప్రియమైన జనని.. మేం అట్లాంటిక్ సముద్రం దాటి.. మాలో లక్ష్యం జ్వలించేలా వెళ్లి చరిత్ర సృష్టించేలా చేసింది మీ మద్దతు. నాకు ఆర్ఆర్ఆర్ సర్వస్వం. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు అర్థం ఏంటంటే.. రిటర్న్ హోమ్ (దేశానికి తిరిగి రావడం).. రిసీవ్ యువర్ లవ్ (మీ ప్రేమను స్వీకరించడం).. రిజాయిస్ (సంతోషంగా ఉండటం)" అని కీరవాణి రాసుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X