twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్: రంగంలోకి ఎంఎం కీరవాణి, సాయి కొర్రపాటి!

    బాలయ్య హీరోగా తెరకెక్క ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయి.

    By Bojja Kumar
    |

    బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి మరిన్ని ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు తేజకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా సంగీత దర్శకుడు కూడా ఖరారైనట్లు సమాచారం.

    తెలుగులో సీనియర్ సంగీత దర్శకుడు, బాహుబలితో పాటు ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్‌గా ఖరారు కాలేదు.

    బాలయ్యతో కలిసి విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి

    బాలయ్యతో కలిసి విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలయ్యతో కలిసి విష్ణు ఇందూరి, సాయి కొర్రాపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    కీరవాణి అయితేనే బెటర్

    కీరవాణి అయితేనే బెటర్

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి అయితేనే బెటర్ అని దర్శక నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మెలొడీస్, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంలో కీరవాణి సీనియారిటీ సినిమాకు ప్లస్సవుతుందని అంటున్నారు.

    శర వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు

    శర వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు

    ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు తేజ, బాలకృష్ణ కలిసి నాలుగైదు సిట్టింగ్స్ వేసి ఏయే అంశాలు సినిమాలో ఉండాలనే అంశంపై చర్చించారు. వాటి ఆధారంగా స్క్రిప్టు వర్క్ పూర్తి చేసిన తేజ... నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపికపై దృష్టి సారించారు.

    జనవరిలో సినిమా ప్రారంభం

    జనవరిలో సినిమా ప్రారంభం

    ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా జనవరి 18న సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

    English summary
    NTR Biopic makers are planning to rope in top technicians for the film. The latest is that MM Keeravani is being considered to provide music for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X