RRR: ఆస్కార్ వేదికపై కీరవాణితో 'నాటు నాటు' సాంగ్ లైవ్ షో.. షాకింగ్ గా నెటిజన్ల విమర్శలు!

తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. ఇంకా సినీ ప్రముఖులు, క్రిటక్స్ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులు గెలుచుకుంటోంది. ఇటీవలే నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కగా ఆ పురస్కారాన్ని సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. అలాగే క్రిటిక్స్ ఛాయిస్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది. అయితే తాజాగా RRRకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

తెలుగు చిత్రీసీమ దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా RRR. ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట మొదలైంది. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది రౌద్ర రణం రుధిరం చిత్రం. ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డుల పంట కొనసాగుతోంది. ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC), సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు రాగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వచ్చాయి.

MM Keeravani RRR Natu Natu Song Live Show On 95th Oscar Stage And Netizens Trolling

ఇలా అవార్డులతో దూసుకుపోతున్న RRR ఆస్కార్ కు కూడా నామినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైంది. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కీరవాణి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ క్రమంలో ఆస్కార్ వేదికపై ఈ పాటను ప్రదర్శించేందుకు కీరవాణితో పాటు చంద్రబోస్ కు కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో ఆస్కార్ వేదికగా కీరవాణి లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే ఆస్కార్ వేదికగా ఇలా ఇప్పటికే.. ఏఆర్ రెహమాన్ జై హో పాటను లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈసారి కీరవాణి అలా ఆస్కార్ స్టేజీపై లైవ్ పర్ఫామెన్స్ ఇస్తున్నారనే వార్తలు సినీ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ పాట పాడిన సింగర్, డ్యాన్స్ కంపోజర్ లకు కూడా ఇందులో భాగం ఉంది కదా.. వాళ్లనెందుకు ఆహ్వానించలేదు అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. స్టేజీలపై ఎప్పుడూ కీరవాణి కుటుంబమమే కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారం సమయంలో కూడా ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఆస్కార్ స్టేజీపై కీరవాణి లైవ్ పర్ఫామెన్స్ అన్న వార్తలు రావడంతో ఈ కామెంట్స్ కూడా ఊపందుకున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. వీరంతా ఓ వారం ముందుగానే వెళ్లనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X