twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పట్లో పుస్తకాల పురుగు, ఇప్పుడేమో కరోనా పురుగు.. ఆర్జీవీపై కీరవాణి అదిరిపోయే సెటైర్

    |

    సంగీత దర్శకుడు కీరవాణిలో ఎంత హాస్య చతురత ఉందో అందరికీ తెలిసిందే. కరోనాపై కీరవాణి చేసిన పేరడీ సాంగ్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనాపై సినీ సంగీత దర్శకులు, పాటలు రచయితలు తమ కలానికి పదును పెట్టి ప్రజలకు అవగాహన కలిగించారు. రామ్ గోపాల్ వర్మ కూడా తన ప్రతిభనంతా రంగరించి కరోనాను చీల్చి చెండాడు.

    మామూలుగానే ఆర్జీవీ ట్వీట్ ఎవ్వరికీ అర్థం కావు. ఇక కరోనా విజృంభిస్తుంటే.. వాటిపై వర్మ కూడా ట్వీట్ల దాడి చేయడం మొదలుపెట్టాడు. కరోనాపై సెలెబ్రిటీలంతా పాటలు విడుదల చేస్తుంటే.. వర్మ కూడా తన కలానికి పదును పెట్టాడు. కరోనా పురుగు అంటూ నానా రకాలుగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు. కరోనా పురుగు అంటూ కీరవాణి ఆర్జీవీపై సెటైర్ వేశాడు.

     MM Keeravani Satire On Ram Gopal Varma And Corona Purugu

    ఈ మేరకు కీరవాణి ట్వీట్ చేస్తూ వర్మ నాడు ఎలా ఉండేవాడో నేడు ఎలా ఉన్నాడో చెప్పుకుంటూ ఓ సెటైర్ వేశాడు. '1988లో రామ్ గోపాల్ వర్మ ఓ పుస్తకాల పురుగు అని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు కరోనా పురుగును విశ్లేషిస్తూ బిజీగా ఉన్నారు.. స్టీఫెన్ కింగ్ బుక్‌ను ఇంకా చదువుతూనే ఉన్నావా?' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.

    English summary
    MM Keeravani Satire On Ram Gopal Varma And Corona Purugu. He Says That RGVzoomin I knew in 1988 was a Pusthakaala Purugu. Now he is busy analysing Corona puruguWinking face Sir, are you still reading Stephen King ?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X