నాగార్జున కొత్త అబ్బాయి.. అందుకే ఆ సినిమా చేయలేదు.. కీరవాణి!
కింగ్ నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో చాలా కలం తరువాత వస్తున్న చిత్రం ఆఫీసర్. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో నటించితిన చిత్రం ఇది. ముంబై మాఫియా నేపథ్యంలో ఉత్కంఠ భరిత యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రీరిలీజ్ వేడుకకు నాగార్జున, వర్మతోపాటు అఖిల్, నాగచైతన్య హాజరయ్యారు.
ఈ ఈవెంట్ కు కీరవాణి అతిధిగా హాజరయ్యారు. చెరువులో నీళ్లు ఉంటే భయపడతాం. నీళ్లు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. రాంగోపాల్ వర్మ తుపాకి తీసుకుని హ్యాండ్సప్ అని అంటారు. వెంటనే భయం వేస్తుంది. శివ చిత్రంలో తుపాకీ తీసుకుని చరిత్ర మొత్తాన్ని కాల్చి పడేశారని కీరవాణి అన్నారు. కొన్ని సార్లు వర్మ తుపాకీతో బుల్లెట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఆయన హ్యాండ్సప్ అని చెప్పినప్పుడల్లా భయపడాల్సిందే. ఎందుకంటే చెరువులా బులెట్ బయటకు కనిపించదు అని కీరవాణి అన్నారు.

నాగార్జునతో తాను శివ చిత్రం చేయాల్సిందని కానీ అప్పటికి నాగార్జున కొత్త అబ్బాయి కనుక శివ చిత్రం చేయలేదని కీరవాణి అన్నారు. నాగార్జున పేరుచెబితే నాకు వెంటనే తెలుసా మనసా సాంగ్ గుర్తుకు వస్తుందని కీరవాణి అన్నారు. తెలివితేటలు, హార్డ్ వర్క్ తో పాటు కొండంత ధైర్యం కలిగిన వ్యక్తి వర్మ అని కీరవాణి అన్నారు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసి తన ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications











