twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమ్.ఎన్.నంబియార్ మృతి

    By Staff
    |

    MN Nambiyar
    ప్రముఖ తమిళ నటుడు మంజరీ నారాయణన్ నంబియార్(ఎమ్.ఎన్.నంబియార్)(89) ఈ రోజు మధ్యాహ్నం(బుధవారం) చెన్నై లోని ఆయన స్వగృహంలో మరణించారు.గత కొంతకాలంగా అస్వస్ధతగా ఉన్న ఈయన కొద్ది రోజుల క్రిందటే ఆసుపత్రి నుండి డిస్ఛార్చ్ అయ్యారు. నంబియార్ మార్చి ఏడు,1919 లో కేరళలోని కన్నూరులో జన్మించారు.ఆయన మొదటి సినిమా భక్త రామ్ దాస్(1935) హిందీ,తమిళ్ లో చేసారు. తమిళ సినిమాకు మొదటి విలన్ గా ఆయనను చెపుతూంటారు. ఆయన తెరమీదకు రాగానే అప్పట్లో టప్పుట్లు పడేవంటారు.స్టేజి ఆర్టిస్టుగా ప్రూవ్ అయి సినిమాల్లోకి రావటంతో పెద్ద పెద్ద నటులు సైతం ఆయన సలహాలు కోరేవారని చెప్పుకుంటూంటారు. ఎమ్.జి.ఆర్ ఫార్ములా సినిమాలు ఈయన విలన్ గా లేకపోతే పూర్తి కానట్లు ఫీలయ్యేవారుట.

    ఆ తర్వాత కాలంలో ఆయన కాలంతో పాటే మారి క్యారెక్టర్ పాత్రలుకు ప్రాణం పోసారు.సినిమాల్లో విలన్ గా చేసినా నిజజీవితంలో గొప్పమనిషిగా,అజాత శత్రువుగా, పెద్ద మనిషిగా పేరు పొందారు. ఇక ఇప్పటికి తెలుగు,తమిళ,మళయాళ,హిందీ భాషల్లో దాదాపు వెయ్యవరకూ సినిమాల్లో జీవించిన ఆయన మృతికి తమిళ పరిశ్రమకు ఎనలేని సేవ చేసారు. ఈ విషయమై ప్రముఖ దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ...నంబియార్ ని ఎవరు మర్చిపోగలరు..ఆయన విలనిజం ఇప్పటికీ నా కళ్ళ ముందు ఆడుతోంది అంటూ సంతాపం వ్యక్తం చేసారు. ఇక ఆయన మృతికి చిన్నా పెద్దా తేడా లేకుండా తమిళ పరిశ్రమ మొత్తం దుఖం సాగరంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X