దేశం విడిచి వెళ్లాలంటూ...అద్నన్ సమీకి సమన్లు

By Bojja Kumar

Adnan Sami
ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, పాకిస్థాన్ జాతీయుడైన అద్నన్ సమీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేసారు. తన వీసా గడువు ముగిసినా ఆయన ఇంకా భారత్‌‍లోనే ఉంటుండటంతో....వెంటనే దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా...ఆయన తరుపు లాయర్ వీసా గడువు పొడగింపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అద్నాసమీ వీసా గడువు ముగిసినా ఇండియాలో ఉంటుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎస్ఎన్) అనుబంధ సంస్థ మహారాష్ట్ర నవ నిర్మాణ్ చిత్రపథ్ కర్మచారి సేన(ఎంఎన్‌సికె‌ఎస్) అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆయన వీసా గడువు పొగించకూడదని కోరింది.

ఎంఎన్‌సికె‌ఎస్ అధ్యక్షుడు అమేయ కోప్కర్ మాట్లాడుతూ...ఆయన వీసా గడువు పొడగించకూడదని అధికారులను కోరాం. భారత్‌ దేశం ఎంతో మంది ప్రతిభగల గాయకులను కలిగి ఉంది. పాకిస్థాన్ నుంచి వచ్చి ఓ సింగర్ ఇక్కడ పాటలు పాడాల్సిన అవసరం ఎంత మాత్రం ఇక్కడ లేదు అని తెలిపారు. కాగా....అద్నాన్ సమీ లాయర్ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా వారు పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని తెలిపారు.

అద్నాన్ సమీ గత 20 ఏళ్లుగా వీసాతో భారత్‌లో ఉంటున్నారని, అక్టోబర్ 6తో వీసా గడువు ముగిసినందున మళ్లీ వీసా పొడగింపుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీసా పొడగింపు ప్రాసెస్ తరచూ నార్మల్ గా జరిగేదే అని, దీనిపై కొంత మంది అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.

అద్నాన్ సమీ బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాల్లో పాటలు పాడారు. 100%లవ్, ఊసరవెల్లి, ఇష్క్, జులాయి, దేవుడు చేసిన మనుషులు, దేనికైనా రెడీ, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల్లో అద్నాన్ సమీ పాడిన పాటలకు మంచి స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X