అడ్డంగా బుక్కైన ప్రకాష్ రాజ్.. పోలిసుల వద్ద ఆధారాలు!
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తరచుగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్రమోడీపై చేసిన రాజకీయ విమర్శలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ కేసు నమోదైంది. అందుకు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయి అంటూ పోలీసులు చెబుతున్నారు.

నామినేషన్ దాఖలు
తన స్నేహితురాలు, జర్నలిస్ట్ గౌరి లంకేశ్ హత్య విషయంలో ప్రకాష్ రాజ్ మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నరేంద్రమోడీపై ఆయన తరచుగా తీవ్రమైన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ ఇటీవల బెంగుళూరు సెంట్రల్ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేశారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘన
మార్చి 12న బెంగుళూరులోని ఎంజి రోడ్ లో కొంత మంది మీడియా ప్రతినిధులు భావప్రకటనా స్వేచ్ఛపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది రాజకీయ పరమైన ర్యాలీ కాదు. కానీ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మైక్ లో ప్రసంగిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారని పోలీసులు అంటున్నారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి ఆయనపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసలు తెలిపారు.

ఆధారాలు ఉన్నాయి
ఆ ర్యాలీ రాజకీయ పరమైన అంశాలకు అనుమతి ఇచ్చింది కాదు. అయినా కూడా ప్రకాష్ రాజ్ మైక్ లో తన ఇష్టప్రకారం ప్రసంగించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ కు కొందరు ప్రకాష్ రాజ్ ప్రసంగించిన వీడియోల్ని షేర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ తో పాటు ఆ కార్యక్రమ నిర్వాహకులపై కూడా కేసు నమోదైంది.

అడ్డుకోవాలని ప్రయత్నించగా
ప్రకాష్ రాజ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు అని తెలియగానే ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. కానీ అప్పటికే కార్యక్రమం ముగియడంతో అంతా వెళ్లిపోయారు అని ఓ పోలీస్ అధికారి వివరించారు. తదుపరి ప్రకాష్ రాజ్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











