twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శిల్పా శెట్టి నా అందం నాశనం చేసింది

    By Srikanya
    |

    చక్కగా నిగనిగలాడే నా ముఖాన్ని శిల్పాశెట్టి నాశనం చేసిందంటూ గౌరీఖాన్ అనే సినీ నటి గొడవచేస్తోంది.ఈ వివాదానికి సంభందించిన కేసు ఈ వారం కోర్టులో విచారణకు రానుంది. ఇక ఈ కేసు వివరాల్లోకి వస్తే..ముంబైలో శిల్పాశెట్టికి 'ఐవోసిస్‌' అనే బ్యూటీ పార్లర్‌ వుంది. ఈ పార్లర్‌ మీద ఇటీవల ఓ కంప్లైంట్ నమోదైంది. ఐవోసిస్‌ పార్లర్‌లో గౌరీ ఖాన్ ముఖానికి ఓ ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. అందుకోసం బాగా డబ్బు వసూలు చేసారు. అయితే అవసరమైన కోర్సు పూర్తి చేసిన అనంతరం అందంగా నిగనిగలాడవలసిన గౌరీఖాన్‌ ముఖం అంద విహీనంగా తయారైంది. అందంకోసం ముఖానికి పూసిన కెమికల్‌ మిశ్రమంలో తప్పు జరిగి ట్రీట్‌మెంట్‌ వికటించినట్లు గౌరీఖాన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    అయితేఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే గౌరీఖాన్ ఓ అప్ కమింగ్ సినీ ఆర్టిస్టు. ఇరవై రెండు సంవత్సరాల గౌరీ ఖాన్ నటించిన ది లెజెండ్ ఆఫ్ మాయావతి చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. అలాగే ఆమె కొన్ని టెలీ బ్రాండ్స్ కు కూడా మోడల్. దాంతో తనకు నష్టపరిహారంగా 17 లక్షల రూపాయలు కట్టమంటూ గౌరీఖాన్‌ డిమాండ్ చేస్తోంది. అయితే శిల్పా న్యాయవాదులు దీన్ని త్రిప్పి కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు. ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటున్న సమయంలో పాటించవలసిన నియమాలను గౌరీఖాన్‌ పాటించలేదని, దాని వల్లనే ఆమె మొఖంలో రియాక్షన్‌ చోటుచేసుకుందని కోర్టులో వాదిస్తున్నారు. ఏదైమైనా ఇటీవలనే వివాహ జీవితంలోకెళ్ళిన శిల్పాశెట్టిని ఈ వివాదం కలవరపెడుతోందని వినిపిస్తోంది. యోగా, బ్యూటీపార్లర్ అంటూ తన అందం చూపుతూ మార్కెటింగ్ చేసుకుంటున్న శిల్పాకు ఇది ఎదురుదెబ్బే అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X