లక్ష్మీస్ ఎన్టీఆర్: తెరపైకి రూపాలి సూరి పేరు... ఆమె ఎవరో చెప్పిన వర్మ!

Recommended Video

Ram Gopal Varma Tweets On Lakshmi's Ntr

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి రెండు రోజులుగా ఓ వార్త హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో ముంబై మోడల్ రూపాలి సూరి నటిస్తోందంటూ ప్రచారం మొదలైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ తిరుపతి ప్రెస్ మీట్ సమయంలో రూపాలి కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.

వర్మ తన సినిమాల ద్వారా కొత్త హీరోయిన్లను పరిచయం చేయడం మామూలే. లక్ష్మి పార్వతి పాత్రకు కూడా అదే తరహాలో కొత్త బ్యూటీని పరిచయం చేయబోతున్నట్లు అంతా భావించారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు ఆమె ఎవరో, ఆరోజు తిరుపతి ఎందుకు వచ్చిందో వివరణ ఇచ్చారు.

అది పూర్తిగా ఫేక్ న్యూస్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో లక్ష్మి పాత్రను రూపాలి సూరి పోషిస్తుంది అనే వార్తలో నిజం లేదు. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. త్వరలోనే ఈ పాత్ర ఎవరు పోషిస్తున్నారనే విషయం ప్రకటిస్తాను అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు.

ఆ రోజు ఆమె మాతో తిరుపతి రావడానికి కారణం

ఆ రోజు ఆమె మాతో తిరుపతి రావడానికి కారణం

మా భాగస్వాముల్లో ఒకరి భార్యకు రూపాలి స్నేహితురాలు. అందుకే ఆరోజు మేము తిరుపతి వచ్చినపుడు మాతో పాటు వచ్చింది. ఆమెకు... ‘లక్ష్మిస్ ఎన్టీఆర్' సినిమాకు ఎలాంటి కనెక్షన్ లేదు అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

ఎవరీ రూపాలి సూరి?

ఎవరీ రూపాలి సూరి?

రూపాలి సూరి ముంబైలో పుట్టి పెరిగిన అమ్మాయి. ప్రముఖ ముంబై మోడల్ నటాషా సూరి సోదరి. రూపాలి కూడా తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ‘డాడ్ హోల్డ్ మై హ్యాండ్' అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలను ఫోకస్ చేస్తూ ఈ చిత్రం సాగనుంది. జనవరి 24న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X