బిగ్ బాస్ హౌస్ లో మిస్ హైదరాబాద్
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం, మంచి ఎంటర్టెన్ అందించడం, సెకండ్ సీజన్ పై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

15వ సెలబ్రిటీగా కామన్ ఉమెన్ సంజనా అన్నె
కామన్ మ్యాన్ కేటగిరిలో సంజనా అన్నె బిగ్ బాస్ హౌస్2 హౌస్ లోకి ప్రవేశించారు. ఐశ్వర్యరాయ్ స్ఫూర్తిగా భావించే సంజనా మోడల్ గా రాణిస్తున్నారు. రియాలిటీ షోలో రాణించడానికి నేను ఎలా ఉంటానో అలానే వ్యవహరిస్తాను అని సంజనా అన్నారు. విజయవాడకు చెందిన సంజనా మిస్ హైదరాబాద్ గా ఎంపికయ్యారు.


Click it and Unblock the Notifications











