twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ మోడల్స్ అర్ద నగ్నంగా... (ఫోటోలు)

    By Srikanya
    |

    ముంబై: నగరానికి చెందిన ఇద్దరు మోడల్స్..డిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ని నిరసిస్తూ...అర్ద నగ్నంగా ఫోటో షూట్ చేసుకుని వార్తల్లో నిలిచారు. అయితే ఈ ఫోటోలు చూసిన వాళ్లు.. ఆ మోడల్స్ రేప్ ని ప్రొటస్టు చేస్తున్నట్లు లేదు.. కేవలం.. తమను తాము పబ్లిక్ గా ఎక్సపోజ్ చేసుకుంటున్నారు అంటున్నారు.

    ఓ కళాశాల విద్యార్థిని న్యూఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. ఓ కాలేజీ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ బస్సులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వారిద్దరు కలిసి ఆదివారం రాత్రి ఓ బస్సులో వెళుతున్నారు. ఆ సమయంలో అదే బస్సులో ఉన్న కొందరు యువకులు అమ్మాయిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి బాయ్ ఫ్రెండ్‌ను కొట్టి బస్సులో నుండి కిందకు తోసేశారు.

    యువతి పైనా అత్యాచారం చేసి ఆమెను కూడా బస్సులో నుండి కిందకు తోసేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం... అమ్మాయి, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మునిర్కా నుండి ద్వారక వెళ్లేందుకు రాత్రి బస్సు ఎక్కారు. బస్సు మహిపాల్పుర్ చేరుకున్న సమయంలో సామూహిక అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరిని బస్సులో నుండి తోసేశారు.

    గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ మోడల్స్ అర్ద నగ్నంగా... (ఫోటోలు)

    ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఏడాది అత్యంత విషాదకరమైన సంఘటన ఇదే. మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. పక్షం రోజుల క్రితం ఢిల్లీలోని ఓ బస్సులో 23 ఏళ్ల యువతి దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది.

    గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ మోడల్స్ అర్ద నగ్నంగా... (ఫోటోలు)

    పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బాధితురాలిని గురువారం సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. భారత కాలమానం ప్రకారం ఆమె తెల్లవారు జామును 2 గంటల 15 నిమిషాలకు మరణించింది. అంతకు ముందు ఆమెకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. రోగి డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచిందని చెప్పడానికి విచారిస్తున్నామని ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కెల్విన్ లోహ్ ఓ ప్రకటనలో చెప్పారు.

    గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ మోడల్స్ అర్ద నగ్నంగా... (ఫోటోలు)

    ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దోషులను శిక్షించే విషయంలో ఎలాంటి ఆలస్యం జరగబోదని, దోషులను వదిలిపెట్టేది లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు హామీ ఇచ్చారు.

    గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ మోడల్స్ అర్ద నగ్నంగా... (ఫోటోలు)

    వీలయినంత త్వరగా దోషులను చట్టం ముందు నిలిపి శిక్షించేలా చూడడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సోనియా పక్కనే ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. రేప్ నిందితులపై విచారణ త్వరగా జరగడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని అడగ్గా, మహిళల పట్ల నేరాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేయడానికి మార్గాలను సూచించేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జెఎస్ వర్మ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం నియమించిందని ప్రధాని చెప్పారు.

    గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ మోడల్స్ అర్ద నగ్నంగా... (ఫోటోలు)

    ప్రధాని గ్యాంగ్‌ రేప్ దోషుల సంగతిని చట్టం చూసుకుంటుందని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. మహిళల భద్రతే తమ ప్రధాన బాధ్యతని, దేశ రాజధానిలో వారికి సంబంధించిన అంశాలపై కమిషన్ ఆఫ్ ఇంక్వైరీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుత చట్టాలను పునఃసమీక్షించి, తీవ్రమైన లైంగిక నేరాలకు ఎటువంటి శిక్షలు విధించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.

    గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ మోడల్స్ అర్ద నగ్నంగా... (ఫోటోలు)

    రేపిస్టుల పేర్లు, ఫొటోలు దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలోనూ బహిరంగ ప్రదేశాలోనూ, వెబ్ సైట్లలోనూ ప్రదర్శించనున్నట్లు హోంశాశ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ అన్నారు. అత్యాచార దోషుల డాటాబేస్‌ను తయారు చేయాలని, వారి ఫొటోలు, వివరాలు, అడ్రస్ సేకరించి బయటపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని చేపట్టాలని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోని ఆదేశించినట్లు హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు.

    English summary
    Two Models did a topless photoshoot to protest the recent gangrape case in Delhi. But looking at the photos of the scorching model a question rises: Is this an act of 'protest' or an attempt to encourage men to think vulgar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X