పవన్ కళ్యాణ్ గురించి మోడీ ట్వీట్

By Srikanya

హైదరాబాద్ : రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ...తన జనసేన పార్టీ తరుపున ..బీజీపే పార్టీ ప్రధాన అభ్యర్ది నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. మొదటి మీటింగ్ లోనే మోడీ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ విషయమై నరేంద్ర మోడీ చాలా సంతృప్తి చెందినట్లు...ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ...చిత్త శుద్ది,నిబద్దత కలిసిన ఓ గొప్ప వ్యక్తి పవన్ అని కొనియాడారు. దేశానికి సేవ చేయాలన్న పవన్ ఆశయం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.

ఇక దేశానికి నరేంద్రమోడీ వంటి బలమైన ప్రధానమంత్రి అవసరం ఎంతో ఉందని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినీహీరో పవన్‌కల్యాణ్‌ చెప్పారు. మోడీకి, ఆయన పార్టీ భాజపాకు తాము మద్దతిస్తామని ప్రకటించారు. తనకు పదవులకన్నా తెలుగు ప్రజల సంక్షేమమే ముఖ్యమని పునరుద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేది, లేనిదీ త్వరలో ప్రకటిస్తానన్నారు. పవన్‌కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

''కేంద్రప్రభుత్వానికి సారథ్యం వహించిన కాంగ్రెస్‌ వూగిసలాట ధోరణి కారణంగా దేశానికి ఎంతో నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తీరే దానికి మంచి ఉదాహరణ. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఉండిఉంటే అలా జరిగేది కాదు. దేశానికి మోడీ వంటి గట్టి ప్రధానమంత్రి అవసరం. ఆయనకు నా తరఫున, నా పార్టీ తరఫున మద్దతు తెలపటానికి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మోడీతో చర్చించాను. ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీకి, ఆయన పార్టీ భాజపాకు మద్దతిస్తాను. నేను రాజకీయ నాయకుడిని కాను. అధికారంలోకి రావాలని, పదవులను చేపట్టాలని నాకు లేదు.

pawan kalyan

తెలుగు ప్రజలకు మంచి చేయటం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలుంటే అది తెలుగు ప్రజలకే కాదు.. దేశ సమగ్రతకే భంగకరం. కానీ, ఏ నాయకుడూ దీనిపై దృష్టి సారించటం లేదు. తెలుగు అనే గుర్తింపు, తెలుగు ప్రజల మధ్య ఐక్యత లేకపోవటం దేశ సమగ్రతకు మంచిదికాదని మోడీ కూడా అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని సూరత్‌లో తెలుగు ప్రజానీకం సీమాంధ్ర, తెలంగాణ అన్న భేదం లేకుండా ఎంతో సఖ్యతతో ఉంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో అది ఎందుకు సాధ్యం కాదని మోడీ ప్రశ్నించారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ప్రజలు ఐక్యతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ ప్రధానమంత్రి కావటం తెలుగు ప్రజలకు అవసరం. మోడీ ప్రధాని కాబోతున్నారు. నాకు ఆ విషయంలో పూర్తి నమ్మకం ఉంది. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలా? వద్దా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి? అన్న అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి కొన్ని రోజులు పడుతుంది'' అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి పవన్‌కల్యాణ్‌ నిరాకరించారు. భాజపా తరఫున ప్రచారం చేస్తారా అని అడిగినప్పుడు.. ఆ పార్టీకి మద్దతిస్తానని పునరుద్ఘాటించారు. రాజకీయాల్లో తన సోదరుడు చిరంజీవి దారి, తన దారి ఎందుకు వేరైందన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు. తమిళనాడులో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకొని గట్టి పునాదిని ఏర్పర్చుకున్న భాజపా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెదేపా, జనసేనలతో చేతులు కలపటానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే, పవన్‌, మోడీ సమావేశం జరిగిందని, త్వరలో జనసేన ఎన్‌డీఏలో చేరుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X