కృష్ణవంశీ సినిమాకి వెడ్డింగ్ స్టైల్లో ఆడియో లాంచింగ్..!
గోపిచంద్, తాప్పీ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో 'మొగుడు" చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగానే 'వరుడు" ముదిరి 'మొగుడు" అవుతాడనే విషయం తెలిసిందే. 'వరుడు" అన్నది 'మొగుడు"కి ముందు దశ అన్నమాట. 'మొగుడు" సినిమా ఆడియో ఫంక్షన్ కూడా 'వరుడు" ఆడియో ఫంక్షన్ లా అంగరంగ వైభవంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మొగుడు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ మరియు దర్శకుడు కృష్ణవంశీ.
అచ్చు 'వరుడు" ఆడియో ఫంక్షన్ తరహాలోనే హీరోహీరోయిన్లు సహా..యూనిట్ సభ్యులంతా పెళ్లికి హాజరయ్యే పెద్దల్లా సాంప్రదాయబద్దమైన పట్టుపంచె, లేదా పట్టు చీర కట్టుకుని హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'వరుడు" ఫంక్షన్ కి కూడా అచ్చు ఇలానే చేసారు. పెళ్లి జరిపించినంత ఘనంగా ఆడియో వేడుకను జరిపించారు.
వరుడు కంటే కాస్త వెరైటీగా ఆడియో వేడుకకు వచ్చే అతిథులను సాదరంగా ఆహ్వానిస్తూ పన్నీరు చల్లి, పువ్వులు ఇస్తారని సమాచారం. వెడ్డింగ్ స్టైల్లో ఆడియో లాంచింగ్ ఉంటుందట. వరుడు తరహాలోనే 'మొగుడు" ఆడియో ఫంక్షన్ ను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేయిస్తున్న కృష్ణవంశీ ..'వరుడు" ఆడియో వేడుకపై 'మొగుడు" సినిమా టాలీవుడ్ లో టాప్ టెన్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలుస్తుందని ప్రకటిస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











