నాకున్న అతి తక్కువ ప్రెండ్స్ లో అతనొకడు...ఎన్టీఆర్
నాకున్న అతితక్కువమంది స్నేహితుల్లో గోపీచంద్ ఒకరు' అని జూ.ఎన్టీఆర్ అన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో గోపీచంద్, తాప్సీ, శ్రద్ధాదాస్ ముఖ్యతారాగణంగా రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రను పోషించిన 'మొగుడు' పాటలను జూ.ఎన్టీఆర్ విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్ రాక్‌గార్డెన్‌లో సందడిగా పాటల విడుదల కార్యక్రమం జరిగింది. పలువురు చిత్రప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఒక్కో పాటని ఒక్కో ప్రముఖుడు విడుదల చేశారు. అల్లు అరవింద్, బ్రహ్మానందం, సురేందర్‌రెడ్డి, నరేష్, అనుష్క, బోయపాటిశ్రీను పాటలను విడుదల చేయగా, పాటల సిడిని జూ.ఎన్టీఆర్ ఆవిష్కరించి వినాయక్‌కు అందజేశారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఎన్టీఆర్ మాట్లాడుతూ...'ఈ చిత్రం పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ అన్నారు. నేను నటించిన 17 సినిమాల్లో ఇప్పటికీ బాగాగుర్తుండిపోయే చిత్రం రాఖీ. దీనిని దర్శకుడు కృష్ణవంశీ అద్భుతంగా తీశారు.
ఆది తీసిన ఈ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న మొగుడు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.ఇక దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ...'మగాడు మొగుడు అనిపించుకునేది కొందరే. అలాంటి మొగుడు కథతో తీస్తున్న చిత్రమిద'ని అన్నారు. 'పదేళ్ళుగా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని ఎదురుచూస్తున్నాను. అది ఇప్పటికి తీరింది అని గోపీచంద్ చెప్పారు. నాకున్న యాక్షన్ ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ ఈ చిత్రం రూపొందించార'ని అన్నారు. ఈ చిత్రం ద్వారా బాబూశంకర్‌ని సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అంతకుముందు డి.సురేష్‌బాబు లోగోని, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఫస్ట్‌లుక్ ఆవిష్కరించారు. ఇంకా ఈ వేడుకలో డా.కె.ఎల్.నారాయణ, బూరుగుపల్లి, సి.కల్యాణ్, రోజా, తాప్సీ, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











