'మొగుడు'సెన్సార్ కట్స్ పచ్చిబూతులు
గోపీచంద్,తాప్సీ కాంబినేషన్ ల వచ్చిన చిత్రం మొగుడు ఈ చిత్రంలో చాలా డైలాగులు సెన్సార్ కోతకు గురి అయ్యాయి.అవేమిటంటే...
ఒకటి రెండు రీళ్లలో :
1. 'పెళ్ళికాకుండా నాకివన్నీ నచ్చవు' అనే డైలాగ్‌లోని ''పెళ్ళికాకుండా'' పదాలు తొలగించి వినబడకూడదన్నారు.
2. ''నా కర్బూజా ఓన్లీ బత్తి పూజా'' పదాలు కత్తిరించి వినబడకూడదన్నారు.
3. ''మేచ్ ఖేల్నే సె హెహ్లే నెట్ ప్రాక్టీస్ హానా పడ్తా'' డైలాగ్ కత్తెర పాలై పైకి వినకూడదన్నారు.
4. ''కుచ్ నహీ కర్తా, జెమినీ టీవీ పే మిడ్‌నైట్ మసాలా దేఖ్తా'' వాక్యం తొలగించి వినబడకుండా చేయమన్నారు.
5. ''ఫ్రీగా సెక్స్ దొరుకుతుందని చేసుకోకూడదురా'' కత్తెరపాలు చేసి శబ్దం వినబడకూడదన్నారు.
6. మేగజైన్ కవర్‌పై గల బికినీ దృశ్యాలను 8.13 అడుగుల నిడివికి కత్త్తెరించారు.
7. ఎ) 'పొటెన్సీ టెస్ట్ ' బి) 'పనికి వస్తారా' పదాలు తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
7. సి. హీరో జిప్ ఊడదీసే దృశ్యాలు 1.14 అడుగుల నిడివికి కత్తెర పాలయింది.
8. 'లవ్ మేకింగ్ సెక్స్ వీక్లీ ట్వైస్' డైలాగ్స్‌లో ''వీక్లీ ట్వైస్'' అనే పదాలు తొలగించి మాటలు వినబడకూడదన్నారు.
9. మూడు నాలుగురీళ్ళలో ''నీయబ్బ దొంగ నా కొడకా'' పదాలు ఎక్కడ వచ్చినా తొలగించి వాటిని వినరాకుండా చేయమన్నారు.
అయిదు ఆరు రీళ్ళలో
10. 'పిచ్చిముండా, బాడకోవ్, లవ్డీు నా కొడుకు' అనే డైలాగ్‌లోని 'ముండా' పదం తొలగించి వినబడకూడదన్నారు.
11. 'మొగుడు మొగుడు....' పాటలో ''రంకు'' పదాన్ని కత్తిరించి వినరాకుండా చేయమన్నారు.
ఏడు ఎనిమిది రీళ్ళలో :
12. 'సీతా కోక చిలుకా...' పాటలో హీరోయిన్ నగ్న శరీరంపై ముద్దులు పెట్టే దృశ్యాలను 4.06 అడుగుల నిడివి మేరకు కత్తిరించారు. ఆస్థానంలో కమిటీ అంగీకరించిన అంతే నిడివిగల వేరే షాట్స్ ఉంచారు.
13. 'బిచ్, చెత్తముండా, స్కూయెడ్' పదాలు కత్తెరపాలు చేసి వినబడకూడదన్నారు.
పదకొండు పన్నెండు రీళ్లలోని 'నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం...' పాటలో ఈ క్రింద పేర్కొన్న విధంగా నిడివికి కత్తెరించి, కమిటీ అంగీకరించిన అంతే నిడివిగల వేరే దృశ్యాలు వుంచడానికి అంగీకరించారు.
14. ఎ) అమ్మాయి ఛాతీపై చేతులుంచే దృశ్యాలు 25.06 అడుగుల నిడివికి కత్తిరించారు.
బి) బొడ్డు క్లోజప్ దృశ్యాలను 00.14 అడుగులు నిడివికి,
సి) ఒక అమ్మాయి పొట్టని హీరో తడిమే దృశ్యాలను 1.08 అడుగుల నిడివికి,
డి) అమ్మాయి పొట్టమీద వుంచిన చేతులుకి సంబంధించి 7.11 అడుగుల నిడివికి,
ఇ) హీరో వీపుపై అమ్మాయి నిలబడే దృశ్యాలు 6.07 అడుగుల నిడివికి,
ఎఫ్) హీరో వెనుక భాగంపై అమ్మాయి నిలబడటం, కూర్చోవడం వంటి దృశ్యాలు 6.03 అడుగుల నిడివికి,
జి) హీరో పక్కన అమ్మాయి కూర్చున్న దృశ్యాలను 4.08 అడుగుల నిడివికి,
హెచ్) హీరోని కౌగలించుకున్న అమ్మాయి వెనుక వేపు పడుకోవడం 1.15 అడుగుల నిడివి మేరకు కత్తిరించి అంతే నిడివిగల, అంతే సమయానికి సరిపడేలా అనుమతి పొందిన వేరే దృశ్యాలను ఆయాచోట్ల జత చేయడానికి అంగీకరించారు.
పదకొండు పన్నెండు రీళ్ళలోని 'కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి పాటలో
15. ఎ) హీరోయిన్ శరీరంలోని పై భాగంలో ఏ విధమైన ఆచ్ఛాదన లేని దృశ్యాలను 28.10 అడుగుల నిడివికి
బి) సింహాలు, చీతా (చిరుతపులులు)కి సంబంధించిన దృశ్యాలు 84.0 అడుగుల నిడివికి కత్తిరించారు. (ఇందులో 39 అడుగుల నిడివిగల వేరే షాట్స్ ఉంచడానికి అంగీకరించి మిగతా 48 అడుగుల నిడివిగల పూర్తిగా షాట్స్‌ని కత్తిరించారు)
సి) శరీరంపై చేతులు వుంచే దృశ్యాలను 9.07 అడుగుల నిడివికి,
డి) హీరో హీరోయిన్లు ఒకరిమీద ఒకరు పడుకునే దృశ్యాలను 25.00 అడుగుల నిడివికి,
ఇ) హీరోయిన్ ధరించిన 'గ్రీన్ బ్రా' దృశ్యాలను 10 అడుగుల నిడివికి,
ఎఫ్) హీరోయిన్ని భుజం మీద పెట్టుకుని, పక్కన పెట్టుకుని హీరో మోసే దృశ్యాలను21.00 అడుగుల నిడివికి కత్తిరించారు.
ఇందులో ఎ నుంచి ఎఫ్ వరకు కత్తెర పెట్టేసిన షాట్స్‌కి బదులు అంతే నిడివితో అదే సమయానికి సరిపోయేలా కమిటి అనుమతి పొందిన షాట్స్ జత చేయడానికి అంగీకరించారు.
పదమూడు పద్నాలుగు రీళ్ళలో :
16. ''నీ కొడుక్కి అంత మదం ఎక్కితే ఓల్డ్ బజార్ మండీ బజార్‌కెళ్ళి దూల తీర్చుకోమను'' అనే డైలాగ్ కత్తిరించి మాటలు వినబడకూడదన్నారు.
17. ''వాడితో పడుకున్నావా... నా మీద ఒట్టేసి చెప్పు వాడితో పడుకున్నావా... అవును వాడు నా మొగుడు నా మొగుడితో నేను పడుకున్నాను... ఏం నీ మొగుడుతో నువ్వు పడుకోలేదా'' అని చిత్రీకరించిన డైలాగ్స్‌ని కత్తెరించి ఆ మాటలు వినబడకూడదన్నారు.
5గురు సభ్యులతో కూడిన ఇ.సి. 'మొగుడు' చిత్రాన్ని చూసి 29 కట్స్‌తో 246.10 అడుగుల నిడివి గల ఫిలిం కత్తిరించి ఇందులో 190.15 అడుగుల నిడివి, అంతే సమయంలో సరిపోయేలా కమిటీ అంగీకరించిన వేరే షాట్స్‌ని జత చేయడానికి ఒప్పుకుని 1-11-11న 'యుఎ' సర్టిఫికెట్ జారీ చేసారు. 4301.25 మీటర్ల నిడివిగల 'మొగుడు' 4-11-11న విడుదలైంది.


Click it and Unblock the Notifications











