twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెసేజ్ కాదు.. కేవలం ఎస్ ఎమ్ ఎస్ మాత్రమే: కృష్ణవంశీ

    By Sindhu
    |

    'మొగుడు" సినిమాతో తెలుగు సాంప్రదాయాల్ని, కుంటుంబ విలువల్ని కాపాడతానని కృష్ణవంశీ చెప్పుకుంటున్నాడు. అయితే ఎంతటి విలువలున్న సినిమా అయినా కానీ ప్రేక్షకులని ఆకర్షించడానికి వాటిని వదులుకోక తప్పదు. ఈ చిత్రంలో మొగుడు, పెళ్లాలుగా నటించిన గోపించద్, తాప్సీల చేత ఎక్స్ పోజిగ్ చేయించి ఆ స్టిల్స్ నే సినిమా ప్రమోషన్ కి వాడుతున్న కృష్ణవంశీ ఇప్పటికే పలువురు విమర్శలకి టార్గెట్ గా మారాడు.

    అయితే మొగుడు సినిమాతో తాను ఎలాంటి మెసేజ్ ఇవ్వట్లేదని కృష్ణవంశీ స్పష్టం చేశాడు. తాను రెవల్యూషన్ తీసుకురావట్లేదట. ఇది జస్ట్ రిమైండర్ మాత్రమే. మెసేజ్ కాదు... కేవలం ఎస్ఎమ్ఎస్ మాత్రమే అని చెబుతున్నాడు. ఈ సినిమాతో ఏదో సమాజాన్ని ఉద్దరించాలనుకోవట్లేదని... మొగుడు ఇలా ఉంటే బాగుంటుందని మాత్రమే చెబుతున్నానని అంటున్నాడు.

    ఈసినిమాతో సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, డైలాగ్ రైటర్....ఇలాముగ్గురు కొత్తవాళ్లను పరిచయం చేస్తున్నారు... కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడం కోసమేనా అనడిగితే.... తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. సినిమాకు ఎవరు పనికొస్తారో వాళ్లనే నేను ఎంచుకుంటాను. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే మహత్తర కార్యక్రమం నేను పెట్టుకోలేదు.

    తాప్సీ డబ్బింగ్ గురించి చెబుతూ.... దాదాపు పదిహేనుమంది డబ్బింగ్ ఆర్టిస్టులతో ఆడిషన్ చేశాం. కానీ తాప్సీ క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఎవ్వరూ డబ్బింగ్ చెప్పలేకపోయారు. ఆ పాత్ర హైట్స్ కు చేరుకోలేకపోయారు. లాభం లేదని తాప్సీతోనే ట్రై చేశాం. తన పాత్రకు తాప్సీ డబ్బింగ్ బాగా చెప్పకుంది. క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయింది. దీంతో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అర్థమయ్యిందని.... కృష్ణవంశీ చెప్పాడు.

    English summary
    With the 'Diwali' releases out in the theatres and reports already arriving, the time has come to have a look at what is coming next. We are talking about the new movie ‘Mogudu’ and this is directed by the creative Krishna Vamsi. Now, the trailers of the film were screened in the theatres along with '7th Sense'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X