‘మొగుడు’ ప్రివ్యూ...

By Bojja Kumar

Mogudu movie preview
కృష్ణవంశీ, గోపీచంద్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'మొగుడు'. అలకలు, అల్లర్లు, అందాలు, బంధాలు, భావాలు, భావోద్వేగాలు, సరసాలు, సంప్రదాయాలు వెరసి కృష్ణ వంశీ సినిమా. 'మురారి"గా మురిపించినా, 'చందమామ"లోని చల్లని వెన్నెలను ధియేటర్లలో కురిపించినా అది కృష్ణవంశీకే చెల్లింది. ఆ సినిమాల కోవలోనే చక్కని కథతో 'మొగుడు" సినిమాను తెరకెక్కిస్తున్నారాయన. టైటిల్ రోల్ గోపీచంద్ పోషిస్తున్నారు. తాప్సీ, శ్రద్దాదాస్ నాయికలు.

ఈ సినిమా ప్రోమోస్ అన్నీ ఆమధ్య గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చి ఫ్లాపైన 'వరుడు'ను గుర్తు చేస్తున్నాయి. 'వరుడు' ఫ్లాపవడం వల్లే పెళ్లి అనే కాన్సెప్టుతో హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో 'మొగుడు'ని కృష్ణవంశీ తీసినట్లు అనిపిస్తుంది. 'మొగుళ్లందరూ మగాళ్లే కానీ, మగాళ్లందరూ మొగుళ్లు కారు. చాలామంది మొగుళ్లు మొగుళ్లలా కాకుండా మగాళ్లలా మిగిలిపోతున్నారు. అలా ఉండొద్దు' అనే కథాంశంతో ఈ సినిమాని కృష్ణవంశీ రూపొందించాడు.

'శశిరేఖా పరిణయం', 'మహాత్మ' వంటి ప్రేక్షకులు సరిగా ఆదరించని రెండు సినిమాల తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే, 'వాంటెడ్' వంటి డిజాస్టర్ తర్వాత గోపీచంద్ ఈ సినిమా చేశాడు. అందాల తార తాప్సీ ఇందులో పర్ఫార్మెన్స్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది. తన పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కాలం కలిసొస్తే ఈ పాత్రకి ఆమె అవార్డులు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరో నాయికగా శ్రద్ధాదాస్ నటించింది. గోపీచంద్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించడంతో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. తాప్సీ తల్లిదండ్రులుగా రోజా, నరేశ్ కనిపిస్తారు. కనిపించ బోతున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బేనర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా బాబూశంకర్, సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకాంత్ నర్రోజు, డైలాగ్ రైటర్‌గా భీం శ్రీను పరిచయమవుతున్నారు. ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా భవిష్యత్ ఏమిటో దీపావళి పండగతో తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X