మలేషియాలో మకాం వేసిన మొగుడు
కుటుంబ కథలను సృజనాత్మకంగా తెరకెక్కించడంలో కృష్ణ వంశీది ఓ ప్రత్యేక శైలి. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా రూపొందుతున్న 'మొగుడు" చిత్రానికి ఓ చక్కని నేపథ్యాన్ని ఎంచుకున్నారు కృష్ణ వంశీ. నాయికలుగా తాప్పీ, శ్రద్దదాస్ నటిస్తున్న ఈ చిత్రానికి బుజ్జి అలియాస్ నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతోంది.
సినిమా విషేషాలను నిర్మాత బుజ్జి వెల్లడిస్తూ...మగ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడూ మగాడు కాదు. తాళి కట్టిన ప్రతి వాడూ మొగుడు కాదు. బాధ్యత నెరిగిన వాడు మగాడు అవుతాడు...మనసెరిగిన వాడు మొగుడు అవుతాడు. ఈ అంశాన్ని బేస్ చేసుకుని 'మొగుడు" సినిమా రూపొందుతుందని తెలిపారు. డాక్టర్ రాజేందర్ ప్రసాద్ ఇందులో కీలకమైన పాత్ర చేస్తున్నారని, ఆయన పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. అదే విధంగా నరేష్, రోజా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మలేషియాలో షూటింగ్ జరుగుతుందని, ఈ నెల 26 వరకు షెడ్యూల్ ఉంటుందని బుజ్జి వెల్లడించారు. సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : బాబూ శంకర్, కెమెరా : శ్రీకాంత్, సమర్పణ : బేబీ భవ్య, నిర్మాణం : లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్


Click it and Unblock the Notifications











