ముసలి మొగుడు-పడుచు పెళ్లాం!!
ముసలి వాళ్లు కూడా పసివాళ్ల లాంటి వాళ్లే అన్నట్టు వయసు పెరుగుతున్నా కొద్ది అక్కినేని నాగేశ్వరరావులో పిల్లలలో ఉండే చిలిపితనం కూడా పెరుగుతోంది. ఎవరేమనుకున్నా పరవాలేదు అన్నట్టు మాటలు శృంగార తూటాల్లా పేలుస్తున్నాడు. రక్తి కట్టిస్తున్నాడు. రసానుభూతిని పొందుతున్నాడు. డాన్ సినిమా ఆడియో ఫంక్షన్లో ఆయన మాటలు ఆలానే సాగాయి. డాన్ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనుష్క ముచ్చట గొలుపుతోందని ఆమె మీద మాటల గురి పెట్టాడు.
తన కొడుకు నాగార్జునను అనుష్క ముద్దులలో ముంచెత్తుతోందని తనకు ఎప్పుడు అలా ముద్దులు పెడుతుందోనని ఎదురు చూస్తున్నాను అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. ఒక వేళ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ముసలి మొగుడు పడుచు పెళ్ళాం సినిమా తీస్తే తను హీరోగా అనుష్క హీరోయిన్ గా ఉండాలని ఆకాక్షించారు. అక్కినేనిగారూ మీ కోరిక బాగానే ఉంది కానీ మరి రాఘవేంద్రరావు గారి పరిస్థితేమిటో.


Click it and Unblock the Notifications











