Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అక్టోబర్లో వస్తున్న ‘మొగుడు’
అలకలు, అల్లర్లు, అందాలు, బంధాలు, భావాలు, భావోద్వేగాలు, సరసాలు, సంప్రదాయాలు వెరసి కృష్ణ వంశీ సినిమా. 'మురారి"గా మురిపించినా, 'చందమామ"లోని చల్లని వెన్నెలను ధియేటర్లలో కురిపించినా అది కృష్ణవంశీకే చెల్లింది. ఆ సినిమాల కోవలోనే చక్కని కథతో 'మొగుడు" సినిమాను తెరకెక్కిస్తున్నారాయన. టైటిల్ రోల్ గోపీచంద్ పోషిస్తున్నారు. తాప్సీ, శ్రద్దాదాస్ నాయికలు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) మాట్లాడుతూ...''ఇదొక అందమైన కుటుంబ కథ. అలా అని ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే మెచ్చే సినిమా కాదిది. క్లాసు, మాసు అనే తేడా లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు.
గోపీచంద్ లోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. డా. రాజేంద్రప్రసాద్ ఇందులో కీలకమైన పాత్ర చేస్తున్నారు. ఆ పాత్ర సినిమాకే హైలెట్. జనరంజకంగా ఈ సినిమాను తీర్చి దిద్దుతున్నారు కృష్ణవంశీ. అలాగే నరేష్, రోజా ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. బాబూశంకర్ ని ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఫ్రెష్ గా అనిపించే వైవిద్యమైన స్వరాలను ఆయన అందించారు. చిత్తీకరణ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ ప్రథమార్థంలో పాటలను, ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం"" అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా : శ్రీకాంత్, సమర్పణ : బేబీ భవ్య, నిర్మాణ : లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్.