తాప్సీ అందాలపైనే ఆ ఛానెల్ బెట్టింగ్
తాప్సీ, గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మొగుడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జీ టీవీ వారు తీసుకున్నారు. ఈ ఛానెల్ వారు దాదాపు మూడు కోట్ల యాక్షై లక్షల మొత్తానికి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో తాప్సీ అందాలు వెర్రిక్కించేలా ఉండటం సినిమాపై నమ్మకం పెంచే ఆ మొత్తం ఇచ్చి తీసుకున్నారని మీడియో లో ఓ వర్గం వ్యాఖ్యానిస్తోంది.అంటే దాదాపు ఓ రకంగా బెట్టింగ్ అన్నమాట. ఈ మొత్తాన్ని ఛానెల్ లో వేసినప్పుడు వచ్చే యాడ్స్ ద్వారా రికవరీ చేసుకోవాలి వారు. ఇక గోపీచంద్ కి సైతం మంచి మార్కెట్ ఉండటం ట్రేడ్ లో ప్లస్ అయ్యింది. మరో ప్రక్క బాబూ శంకర్ అందించిన ఆడియో విడుదలై మంచి మార్కులు వేయించుకుంది.
వీటిన్నట్టికి తోడు కృష్ణవంశీ బ్రాండ్ నేమ్ కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతుంది.ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ...'మగాడు మొగుడు అనిపించుకునేది కొందరే. అలాంటి మొగుడు కథతో తీస్తున్న చిత్రమిద'ని అన్నారు. 'పదేళ్ళుగా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని ఎదురుచూస్తున్నాను. అది ఇప్పటికి తీరింది అని గోపీచంద్ చెప్పారు. నాకున్న యాక్షన్ ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ ఈ చిత్రం రూపొందించార'ని అన్నారు.


Click it and Unblock the Notifications











