ఆఫ్‌బీట్ సినిమా మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు
పెళ్ళికొడుకుఎన్నారై. ఇండియా వచ్చి పెళ్ళి చేసుకుంటాడు.కొత్తగా కాపురం పెడతాడు. అయితే ఆకాపురం సజావుగా సాగకుండా ఒక దొంగఅడ్డం పడుతుంటాడు. కొత్త జంట రాజా, శ్రీయ కాగా దొంగోడుబ్రహ్మానందం. త్వరలోవిడుదల కానున్న మొగుడు, పెళ్ళాం,ఓ దొంగోడు సినిమా ఇది. కేవలం మూడే మూడు పాత్రలతోవస్తున్న ప్రయోగాత్మకచిత్రమిది. రాజమండ్రి, హైదరాబాద్‌లలోకేవలం 40 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. భారీబడ్జెట్ సినిమాలే బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతున్న తరుణంలోవస్తున్న చిన్న చిత్రమిది. సినిమాలో మూడుపాత్రలతో పాటు ఒక కుక్క పిల్ల కన్పిస్తుంది.కొన్ని బయటి గొంతులు విన్పిస్తాయి. లోబడ్జెట్‌లోఇటువంటి ప్రయోగాత్మక చిత్రాలురావలసిన అవసరముంది. దర్శకత్వం:వెంకీ. నిర్మాత: వాకాడ అప్పారావు. త్వరలోఆడియో విడుదల కానున్న ఈ సినిమాను ఈ నెలలోనే విడుదలచేయడానికి నిర్మాతలుసన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











