»   » హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న క్రికెటర్ కొడుకు

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న క్రికెటర్ కొడుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అబ్బాస్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో 'నాకు ఓ లవరుంది', 'దక్షిణ మధ్య భారత జట్టు' లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కె.సురేష్ బాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారబోతున్నాడు. 'ఇద్దరికి కొత్తేగా' అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది.

    అజారుద్దీన్ జీవితంపై సినిమా...
    జారుద్దీన్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో ఇమ్రాన్ హస్మి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. 'అజర్' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. 'ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్' అనేది ట్యాగ్ లైన్.

    ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మి అజారుద్దీన్ పాత్రలో కనిపించబోతున్నాడు. క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో.... ఇమ్రాన్ అజారుద్దీన్ స్టైయిల్‌లో బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్వయంగా అజారుద్దీనే వచ్చి ఇమ్రాన్‌కు ట్రైనింగ్ ఇచ్చారు.

    Mohammed Azharuddin's son set for film debut

    'అజర్' చిత్రంలో....అజారుద్దీన్ క్రికెట్లో అంచలంచెలుగా ఎదిగిన ఘట్టాలు....మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితులును ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇందులో అజారుద్దీన్ ప్రేమ వ్యవహారం, పెళ్లి అంశాలను కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నపారు.

    ఆ మధ్య విడుదలైన టీజర్లో.... నేను మూడు కారణాలు వలన బాగా ఫేమసయ్యాను. దేముడ్ని నమ్మడం, పెళ్లి, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ అజర్ డైలాగు చెప్పారు. అవే ఇప్పుడు క్రికెట్ వీరాభిమానులను, సినీ అబిమానులను తన వైపు తిప్పుకుని, ఆలోచనలో పడేలా చేసాయి. అజారుద్దీన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాతి పరిస్థితులను కూడా చూపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇమ్రాన్ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా అజారుద్దీన్ బ్యాటింగ్ శైలి బాగా ప్రాక్టీస్ చేసారు.

    ప్రముఖ దర్శకుడు... అజార్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న వ్యక్తి ఆంటోనీ డిసౌజా. క్రికెటర్ జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించిన ఆంటోనీ సినిమాను వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దగలడన్న నమ్మకంతో దర్శకత్వం బాధ్యతలను అప్పగించారట. ఈ బయోపిక్ ను కేవలం డ్రామాగా తీర్చిదిద్దబోవడంలేదని తెలిపిన చిత్ర బృందం... సినిమాకు అన్ని కమర్షియల్ హంగులూ అద్దబోతున్నట్లు వెల్లడించింది. మే 13న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Former Indian captain Mohammed Azharuddin’s son Abbas is all set to make his cinematic debut with upcoming Telugu entertainer “Iddariki Kottegaa”, which is likely to be launched very soon.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more